ETV Bharat / state

'మేడిగడ్డ ప్రాజెక్టును డబ్బు, కమీషన్ల కోసం తొందరగా పూర్తి చేశారు'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 5:02 PM IST

Updated : Nov 6, 2023, 7:16 PM IST

Kodandaram Reaction on Medigadda Barrage Issue
Medigadda Barrage Issue

Kodandaram Reaction on Medigadda Barrage Issue : రాష్ట ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టును డబ్బు, కమీషన్ల కోసం తొందరగా పూర్తి చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అందుకే బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజాస్వామ్య తెలంగాణను ఏర్పాటు చేసేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఓడించకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని.. ఓడించగలిగితేనే భవిష్యత్‌లో పురోగతినే ఉంటుందని కోదండరాం అన్నారు.

'మేడిగడ్డ ప్రాజెక్టును డబ్బు, కమీషన్ల కోసం తొందరగా పూర్తి చేశారు'

Kodandaram Reaction on Medigadda Barrage Issue : భారతదేశంలో జరిగిన స్కామ్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు శ్వేతపత్రం విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ గురించి నిపుణుల కమిటీలు చెప్పిన విషయాలు తప్పని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం.. అసలు జరిగిన విషయం చెప్పక పోవడమే చోద్యంగా ఉందన్నారు.

Kodandaram Visits Medigadda Barrage In Jayashankar Bhupalpally : చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించినపుడు.. 7వ బ్లాక్‌లో 20 పియర్, బ్రిడ్జ్ కుంగిపోయి గేట్ వంగి పోయి కనబడినట్లు తెలిపారు. బ్లాక్ మొత్తం 10 మీటర్ల లోతు నుంచి బేస్ ఏర్పాటు చేసి పియర్లు నిర్మించారని, దానివల్ల మొత్తం బ్లాక్ కొత్తగా నిర్మాణం చేపట్టవలసి వస్తుందని చెప్పారు.

Kodandaram Comments On Medigadda Barrage Damage : కేంద్ర ప్రభుత్వ నిపుణులు ఏమీ చూడకుండానే నష్టం వాటిల్లిందని చెప్పారని బ్రిడ్జ్‌కు ఉన్న రెండు పలకల మధ్య ఏర్పడిన ఖాళీ స్థలం నుంచి చూస్తే ఏం తెలుస్తుందని అధికారులు అనండం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్టులు, డ్యామ్‌లు పటిష్ఠంగా ఉన్నాయని.. కానీ నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిన కారకులు ఎవరో గుర్తించి శిక్షించాలని.. నిపుణులతో కూడిన జ్యూడీషియరి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.

మధుయాష్కికి సంపూర్ణ మద్దతు తెలిపిన కోదండరాం

Kodandaram Comments on Telangana Congress : తెలంగాణలో బీఅర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావడానికి తెలంగాణ జన సమితి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం జరిగిందని కోదండరాం తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న క్రమంలో ఆ పార్టీకి తమ తరఫున 6 ప్రతిపాదనలు ప్రతిపాదించామని అన్నారు. అందుకు ఆ పార్టీ ఒప్పుకుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన 6 ప్రతిపాదనలు

  • విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలి
  • ఉపాధి ఉద్యోగ కల్పన జరగాలి. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి.
  • చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలకు తోడ్పాటు అందించాలి.
  • కౌలు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి.
  • రాజ్యాంగం ప్రకారం పాలన జరగాలి.
  • ఉద్యమ కారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

ఈ అరు ప్రతిపాదనలు ప్రతిపాదించగా కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకుందని కోదండరాం తెలిపారు. తెలంగాణలో ఈ పాలన అంతం కావడానికి ప్రజలు చైతన్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై వాస్తవ సమాచారం ప్రభుత్వం ఇంకా కమిటీకి ఇవ్వలేదని.. కేసీఆర్ పాలన కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుందన్నారు.

'నిరంకుశ పాలనను అంతమొందించడానికే కాంగ్రెస్​కు మద్దతిస్తున్నాం'

Kodandaram Clarity on Telangana Election Contest : ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు : కోదండరాం

Last Updated :Nov 6, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.