Kodandaram Clarity on Telangana Election Contest : ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు : కోదండరాం

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 10:34 AM IST

thumbnail

Kodandaram Clarity on Telangana Election Contest : ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో.. రాష్ట్ర ప్రభుత్వ పదేళ్ల పాలన, ప్రజల ఆకాంక్షలు, పౌర సమాజ కర్తవ్యాలు అనే అంశంపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనరులను కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఇదేనని కోదండరాం ఆక్షేపించారు. ఇలాంటి పాలన అంతం కాకపోతే తెలంగాణ పురోభివృద్ధి జరగదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు భారంగా, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారిందని కోదండరాం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ  మీడియాను కంట్రోల్ చేసి తప్పులను దాచి పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో తెల్ల కాగితం లాంటిదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.