ETV Bharat / state

MLA Thatikonda Rajaiah Supports Kadiyam Srihari : స్టేషన్​ఘన్​పూర్ ఈజ్ క్లియర్.. ఔను.. వాళ్లిద్దరూ కలిసిపోయారు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 2:30 PM IST

Updated : Sep 22, 2023, 3:18 PM IST

KTR Steps on Rajaiah, Srihari Clash in Ghanpur
MLA Tatikonda Rajaiah Support to MLC Kadiyam Srihari

MLA Thatikonda Rajaiah Supports Kadiyam Srihari : స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గత కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు బహిరంగంగా ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెట్టారు. అయితే తాజాగా ఆ నియోజకవర్గంలో రాజకీయం మారిపోయింది. కడియం, తాటికొండ కలిసిపోయారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో ఇద్దరూ కలిసిపోయి.. వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు.

MLA Thatikonda Rajaiah Supports Kadiyam Srihari : గత కొన్ని రోజులుగా ఉప్పు-నిప్పులా ఉన్న జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ప్రస్తుతానికి సయోధ్య కుదిరింది. కడియం అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాజయ్య ప్రకటించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ టికెట్‌(BRS Ticket) విషయంలో ఇద్దరు నేతల మధ్య చాలా కాలంగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

Thatikonda Rajaiah Vs Kadiyam Srihari : నియోజకవర్గం టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడంతో ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేతలిద్దరూ బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారాస్థాయికి వీరి వివాదం ముదిరింది. ఇది కాస్త పార్టీ అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే కేటీఆర్ వారిద్దరితో కలిసి మాట్లాడారు. అయినా ఇద్దరూ చెరో దారిలో వెళ్లారు. పలుమార్లు అధినాయకత్వం హెచ్చరించినా.. నేతల తీరు మారలేదు.

Kadiam Srihari latest comments : 'అవకాశం వచ్చిందని విర్రవీగొద్దు' కాక రేపుతున్న కడియం వ్యాఖ్యలు..

Station Ghanpur Politics Latest News : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టికెట్‌ కడియం శ్రీహరికి దక్కటంతో రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎలాగైనా మరోసారి టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్న రాజయ్యకు.. అధిష్ఠాన నిర్ణయం అశనిపాతం అయింది. తీవ్ర ఆవేదనతో నియోజకవర్గానికి వచ్చీ రాగానే.. కార్యకర్తల ముందు భోరున విలపించారు. టిక్కెట్ పొందిన తరువాత.. నియోజకవర్గంలో కడియం శ్రీహరి భారీ సభ నిర్వహించారు. ఆ సభకు రావాల్సిందిగా కడియం, పల్లా రాజేశ్వరరెడ్డి రాజయ్యను ఆహ్వానించినా.. ఆయన ముఖం చాటేశారు.

MLA Rajaiah Interesting Comments : ప్రజల్లోనే ఉంటానని చెపుతూనే నారు పెట్టి.. నీరు పోసి.. పెంచి పంట పెద్దది చేసి.. వేరేవారు కోసుకుపోతే చూస్తూ ఊరుకుందామా అంటూ నియోజకవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ తాను కడియంకు మద్దతిచ్చేది లేదని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. మళ్లీ మార్పులు జరుగుతాయని.. తనకు టిక్కెట్ వస్తుందని కూడా అందరి ముందు రాజయ్య విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతిచ్చే విషయంలో సందిగ్ధత నెలకొన్న తరుణంలో.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది.

Kadiam Srihari vs Thatikonda Rajaiah : 'ఎమ్మెల్యే రాజయ్య.. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'

MLA Rajaiah Supports Kadiyam Srihari : ఈ మేరకు ప్రగతి భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలకు నచ్చజెప్పిన కేటీఆర్‌.. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. రాజయ్య భవిష్యత్తుకు కేటీఆర్ భరోసానిచ్చారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ మేరకు రాజయ్య దిగివచ్చారు. రానున్న ఎన్నికల్లో కడియం గెలుపు కోసం పాటుపడతానని రాజయ్య ప్రకటించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌(Ghanpur Ticket Issue)లో గులాబీ జెండా ఎగురవేస్తామని సమావేశం అనంతరం ఇద్దరు నేతలు వెల్లడించారు. ఇరువురి నాయకులు కలిసిపోవడంతో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో జోష్‌ నెలకొంది.

MLA Rajaiah Interesting Comments on 2023 Elections : 'ఎన్నికలు వాయిదా పడొచ్చు.. బీఆర్​ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులకు అవకాశాలు!'

'నా దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఇంటి నుంచి కూడా బయటకు రాలేవు'

Last Updated :Sep 22, 2023, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.