ETV Bharat / state

మార్చి8న కొంగరకలన్​లో.. బలహీన వర్గాల యుద్ధభేరి

author img

By

Published : Jan 24, 2020, 11:29 PM IST

మార్చి8న రంగారెడ్డి జిల్లా కొంగరకలన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బలహీన వర్గాల యుద్ధభేరి మహాసభ నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.

in-kongarakalan-on-march-8-the-warlord-of-the-weaker-sections
మార్చి8న కొంగరకలన్​లో.. బలహీన వర్గాల యుద్ధభేరి


అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. మార్చి8న రంగారెడ్డి జిల్లా కొంగరకలన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బలహీన వర్గాల యుద్ధభేరి మహాసభ నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు.. ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా యుద్ధభేరి మహాసభను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మార్చి8న కొంగరకలన్​లో.. బలహీన వర్గాల యుద్ధభేరి

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

Intro:tg_wgl_62_24_mrps_sanahaka_sabha_ab_ts10070
nitheesh, janagama, 8978753177
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి8న రంగారెడ్డి కొంగరకలన్ లో జరిగే ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీ బలహీన వర్గాల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన జనగామ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఎస్సి, ఎస్టీ బీసీ, మైనార్టీ వర్గాల మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల ప్రభుత్వం చేస్తున్న జాప్యనికి నిరసనగా యుద్ధభేరి మహాసభను ఏర్పాటు చేశామని, అగ్రవర్ణాల మహిళలపై ఘటనలు జరిగితే వెంటనే స్పందించి ఎన్కౌంటర్ చేస్తున్న ప్రభుత్వం, అణగారిన వర్గాలపై జరిగితే ఆలసత్వం ప్రదర్శిస్తుందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అగ్రవర్ణ లకు ఒక న్యాయం అణగారిన వర్గాలకు మరో న్యాయం చేస్తున్న అధికారాన్ని ప్రశ్నిచేందుకే యుద్ధభేరి మహాసభ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
బైట్: మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.