ETV Bharat / state

పదేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి.. కొడుకును విగతజీవిగా చూసి..

author img

By

Published : May 9, 2023, 1:46 PM IST

minor boy road accident in jagtial: బతుకుదెరువు కోసం బయటి దేశం బాట పట్టాడు. పిల్లల భవిష్యత్ కోసం డబ్బు సముపార్జన కోసం కుటుంబానికి దూరంగా బతికాడు. కన్నకొడుకును, కట్టుకున్న భార్యను, కన్నతల్లిదండ్రులను కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాడు. ప్రతిరోజు వారిని కలిసే సమయం కోసమే వేయి కళ్లతో ఎదురు చూశాడు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. తన కుటుంబంతో కలవబోతున్నానని పట్టెడు సంతోషంతో వచ్చాడు. పదేళ్ల తర్వాత తన ఊరుని.. తన వారిని చూస్తాననే ఆనందంతో అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చివరకు తన ఊరు చేరుకున్నాడు. ఏళ్ల తరబడి కొడుకును చూడాలనుకున్న ఆ కన్నతండ్రి.. ఇంటికి వచ్చిన తర్వాత తన కళ్లెదుట కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. ఆడుతూపాడుతూ హాయిగా తిరగాల్సిన తన కన్నకొడుకు కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తండ్రి గుండె బద్ధలయింది. నాన్నా.. ఎప్పుడొస్తావ్ అంటూ రోజు ఫోన్​లో అడిగిన ఆ గొంతు మూగబోవడం చూసి ఆ తండ్రి గుండె ముక్కలయింది. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మరణించడంతో ఆ కన్నగుండె విలవిలలాడింది. ఈ విషాద ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

minor boy road accident in jagtial
పదేళ్ల తర్వాత వచ్చిన తండ్రికి.. తీరని శోకం

Son died in an accident in Jagital : తండ్రి తన కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత బతుకుదెరువుకోసం.. ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ వెళ్లాడు. పదేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలేదు. కుటుంబ వ్యవహారాలు, పిల్లల బాగోగులు ఫోన్​లో మాట్లాడి తెలుసుకునేవాడు. నేరుగా ఎప్పుడు దగ్గరుండి పిల్లలకు తండ్రి ప్రేమను పంచలేకపోయాడు. అయ్యో నా పిల్లల దగ్గర ఉండలేక పోతున్నానే.. వారికి తండ్రి ప్రేమను పంచలేకపోతున్నానే అని అనుక్షణం మథన పడుతుండేవాడు. అలా పదేళ్లు గడిచిపోయింది.

Minor boy killed in an accident in Jagtial : చాలా కాలం నిరీక్షణ పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. ఎట్టకేలకు ఇంటికి బయలు దేరాడు. కుటుంబ సభ్యులు ఎయిర్​పోర్ట్​కు వచ్చి ప్రేమతో ఇంటికి తీసుకెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత కన్న పిల్లల్ని చూసుకుని ఎంత ఎదిగిపోయారని ప్రేమతో హత్తుకున్నాడు. తండ్రి వచ్చాడనే సంతోషంలో పిల్లలు, పిల్లల్ని చూశాననే ఆనందంలో తండ్రి ఇలా ఆనంద లోకంలో విహరిస్తుండగా ఆ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. కొన్ని గంటల్లోనే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంటికెళ్లిన తర్వాత తాగడానికి నీరు లేకపోవడంతో నీటి డబ్బా తీసుకొస్తానని బైక్​పై వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలనకు వెళ్లిపోయాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి తండ్రి బోరున విలపిస్తూ కుప్పకూలిపోయాడు. ఈ మనసును కదిలించే.. హృదయాన్ని ద్రవింపజేసే ఘటన జగిత్యాలలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్‌, పద్మిని దంపతులకు కుమార్తె హర్ష, కుమారుడు శివకార్తిక్‌(12) ఉన్నారు. . శివకార్తిక్‌ జగిత్యాల పట్టణంలోనే ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మోహన్ ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితమే సౌదీ అరేబియా వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి తోడ్కొని వచ్చారు. ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని శివకార్తిక్‌ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బైపాస్‌ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పదేళ్ల తర్వాత తన కొడుకును చూసుకున్న ఆ తండ్రి ఆనందం అంతలోనే మాయమైపోయిందని స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.