ETV Bharat / state

పార్టీ నుంచి ఎటువంటి సహకారం లేదు.. అందుకే రాజీనామా చేస్తున్నా: బోగ శ్రావణి

author img

By

Published : Feb 23, 2023, 7:22 PM IST

Boga Shravani resigned from BRS party
Boga Shravani resigned from BRS party

Boga Shravani resigned from BRS party: జిగత్యాల జిల్లా బీఆర్​ఎస్ పార్టీ​ మాజీ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ బోగ శ్రావణి పార్టీతో పాటు కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి ఎటువంటి సహకారం గానీ ఓదార్పుగానీ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. ఎమ్మెల్సీ కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Boga Shravani resigned from BRS party: జగిత్యాల జిల్లా బీఆర్​ఎస్​లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన కౌన్సిలర్‌ పదవీతో పాటుగా బీఆర్​ఎస్​ పార్టీకీ రాజీనామ చేశారు. గత కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు, బోగ శ్రావణిల మధ్య విభేదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా ఆమె రాజీనామా ఆ జిల్లాలో చర్చనీయాంశమైంది. తన లేఖను మంత్రి కేటీఆర్​కు​ పంపుతున్నట్లు ఆమె తెలిపారు.

పట్టణంలో ఇంత జరుగుతున్న కనీసం పార్టీ నుంచి ఓదార్పు, సహకారం లేదని శ్రావణి వాపోయారు. ఆ కారణంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రావణి.. సంజయ్​కుమార్​ ఓటమికి మొదటి కారణం తానే అవుతానని జోస్యం చేశారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రోత్సహంతోనే తాను బీఆర్​ఎస్​లోకి వచ్చానని తెలిపారు. ఇన్ని రోజులు తనను ఎంతగానో ప్రోత్సహించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతకొంత కాలంగా ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండగా.. తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతునాయి. శ్రావణి మాత్రం "తనను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయని.. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని" పేర్కొన్నారు.

ఇప్పటికే మున్సిపల్​ ఛైర్​పర్సన్​ పదవికి రాజీనామా చేసిన శ్రావణి.. గతంలోనే ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే మూర్ఖత్వాన్ని మూడేళ్లపాటు భరించానని మీడియా ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. అందరి ముందు ఎమ్మెల్యే తనను అవమానించేవారని ఆరోపించారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్‌..పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని వాపోయారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని.. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ఎత్తకూడదనే అనేవారని తీవ్ర ఆరోపణలు చేశారు.

"స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ నన్ను వేధిస్తున్నారు. రాజీనామా లేఖను మంత్రి కేటీఆర్‌కు పంపుతున్నా. పార్టీ నుంచి ఎటువంటి సహకారం, ఓదార్పు లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నా. ఇన్ని రోజులు నాకు సహకరించిన కేటీఆర్‌, కవితకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సంజయ్ కుట్రలకు బీసీ మహిళా బలయ్యింది. కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం. అన్ని పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా"- బోగ శ్రావణి, జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైరపర్సన్​

పార్టీ నుంచి ఎటువంటి సహకారం లేదు.. అందుకే రాజీనామా చేస్తున్నా: బోగ శ్రావణి

ఇవీ చదవండి:

'ఎమ్మెల్యే వేధింపులతోనే పదవికి రాజీనామా చేస్తున్నా'.. కన్నీరు పెట్టుకున్న ఛైర్​పర్సన్

'అదంతా ఉత్తదే... మేం అధికారంలోకి వస్తే అన్ని ఉంటాయ్'

మజ్లిస్‌కు బీఆర్ఎస్ సపోర్ట్... ఎన్నికల నుంచి బీజేపీ ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.