ETV Bharat / state

YS Sharmila Hunger Strike at Lotus Pond : 'ప్రజలను కలవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలా..?'

author img

By

Published : Aug 18, 2023, 11:06 AM IST

Updated : Aug 18, 2023, 12:46 PM IST

YS Sharmila
YS Sharmila Hunger Strike At Lotuspond

YS Sharmila Hunger Strike at Lotus Pond Hyderabad : పోలీసులు కేసీఆర్​కు తొత్తుల్లా పని చేయడం మానుకోవాలని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల మండిపడ్డారు. గజ్వేల్​ నియోజకవర్గ పర్యటనకు సిద్ధమైన షర్మిలను.. లోటస్​పాండ్​ వద్ద పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి.. అక్కడే పోలీసుల చర్యలకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు.

YS Sharmila Hunger Strike at Lotus Pond ప్రజలను కలవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలా

YS Sharmila Hunger Strike at Lotus Pond Hyderabad : తనను చూసి సీఎం కేసీఆర్​ భయపడుతున్నారని.. వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila) అన్నారు. పోలీసులు కేసీఆర్​కు తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. గజ్వేల్​ నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధమైన వైఎస్​ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా సాయంత్రం వరకు నిరాహార దీక్ష(Hunger Strike) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు పోలీసులకు, షర్మిలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, కేసీఆర్​పై విమర్శలు చేశారు. మరోవైపు ఎక్స్​(Twitter)​లో కూడా ప్రభుత్వ నియంత పోకడలను ఎండగట్టారు.

YS Sharmila House Arrest Hyderabad : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని అడ్డుకుంటున్నారని వైఎస్​ షర్మిల పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి.. ప్రజలను కలవడానికి కూడా అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. గజ్వేల్​లో ఎవరినైనా అరెస్టు చేశారా అని నిలదీశారు. అక్కడ నిరసన తెలుపుతున్న బీఆర్​ఎస్​(BRS) నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు.

"దళితబంధు(Dalit Bandhu) అమలు తీరుపై తమ తరఫున వచ్చి పోరాడమని తీగుల్​ ప్రజలు లేఖ రాశారు. అందుకే అక్కడ పరిస్థితులను తెలుసుకోవడానికి వెళుతున్నాను. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే నన్ను గృహనిర్బంధం చేశారు. దాడులు చేయడానికి మేము తీగుల్​ వెళ్లడం లేదు. ప్రజలు తరఫున పోరాటం చేయడానికి వెళుతున్నాం. తమను అడుగుపెట్టనివ్వమన్న బీఆర్​ఎస్​ నేతలను అరెస్టు చేశారా?. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న తమను అరెస్టు చేస్తారానని" - వైఎస్​ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

  • గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని కలుసుకునేందుకు వెళ్ళాలి అనుకోవటం తప్పా? ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకోవడం… pic.twitter.com/QWf9MTIkaM

    — YS Sharmila (@realyssharmila) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YS Sharmila Fires On BRS : ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎలాగైనా సరే గజ్వేల్​ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గజ్వేల్​కు వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెప్పగా.. కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా లోటస్​పాండ్​లోని నివాసంలో వైఎస్​ షర్మిల నిరాహార దీక్షను చేపట్టారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

"గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని కలుసుకునేందుకు వెళ్లాలి అనుకోవటం తప్పా? ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకోవడం తప్పా? కేసీఆర్ పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇలా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు. పోలీసులు ఉన్నది దొరకు కొమ్ముకాయడానికి కాదు ప్రజల పక్షాన నిలబడాలి. ఇందుకు నిరసనగా అడ్డుకున్న పోలీసులకు హారతి పట్టడం జరిగింది. కేసీఆర్ నియంత పోకడకు నిరసనగా ఇంటి ముందే నిరాహార దీక్షకు కూర్చుంటున్నా." - వైఎస్​ షర్మిల ట్విటర్​

పూర్తి వివరణ : దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్​ నియోజకవర్గంలోని జగదేవ్​పూర్​ మండలం తీగుల్​లో స్థానికులు ఆందోళనకు దిగారు. వారు తమకు మద్దతుగా పోరాటం చేయాలని లేఖ రాశారని.. అందుకే వారికి మద్దతు తెలిపేందుకు నేడు గజ్వేల్​ నియోజకవర్గ పర్యటనకు వైఎస్​ షర్మిల సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోటస్​పాండ్​ వద్ద భారీగా మోహరించారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. గజ్వేల్​ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులువైఎస్​ షర్మిలకు తేల్చి చెప్పారు. దీంతో కాసేపు లోటస్​ పాండ్​ వద్ద తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేశారు.

YS Sharmila Questioning KCR Corruption : 'బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు.. కేసీఆర్​ అవినీతి ఎంతో తెలుసా?​'

YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్‌.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..

Last Updated :Aug 18, 2023, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.