ETV Bharat / state

మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ: సంజయ్‌

author img

By

Published : Mar 8, 2023, 4:26 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అని బండి సంజయ్‌ తెలిపారు. మహిళలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదని తెలిపారు. కొన్నిచోట్ల మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్​ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి పదవుల్లో కానీ, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తుందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతివల కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

మహిళలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనది: దేశంలో సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అంతర్జాతీయంగా చర్చికుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. మహిళలు ఏమీ కోరుకోవడం లేదని.. కానీ వారికి సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదని వివరించారు. కొన్నిచోట్ల మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయిందని తెలిపారు. కవిత చేసిన సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీం అని ఆరోపించారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

"మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ. దేశంలో సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అంతర్జాతీయంగా చర్చించుకుంటున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతివలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. కవిత చేసిన సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీం. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి." - బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

బీఆర్ఎస్ ఆరోపణలపై.. బీజేపీ ఎదురుదాడి: కవితకు నోటీసుల వేళ బీఆర్ఎస్ ఆరోపణలపై.. బీజేపీ ఎదురుదాడికి దిగింది. కవిత తప్పు చేసినందునే ఈడీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారు మహిళలైనా.. పురుషులైనా శిక్ష పడటం ఖాయమని వివరించారు. మహిళల అభివృద్ధికి తమ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కష్టమొస్తే.. తెలంగాణ మొత్తానికి వచ్చినట్లు ఎలా అవుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటే.. బీజేపీకి ఏమిటి సంబంధమని? తెలిపారు. కవితకు నోటీసులు వస్తాయని ముందే తెలిసినా.. మహిళా చట్టంపై ధర్నా అని కొత్త రాగం అందుకున్నట్లుగా ఉందని డీకే అరుణ వ్యంగాస్త్రాలు సంధించారు.

మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ: సంజయ్‌

ఇవీ చదవండి: కవిత వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది: సంజయ్‌

'కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు'

రెండు చేతులతో వేర్వేరు భాషలు రాస్తున్న యువతి.. ప్రపంచ రికార్డులు దాసోహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.