ETV Bharat / state

బంగారం గొలుసు తెమ్మన్నందుకు భర్తను చంపిన భార్య..

author img

By

Published : Oct 22, 2022, 12:01 PM IST

wife brutally killed her husband
wife brutally killed her husband

Wife Brutally Killed Her Husband: ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరికీ రెండో వివాహం. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది.. ఇటీవల రోజూ బంగారం గొలుసు కోసం గొడవ పడుతున్నారు.. దాచిన గొలుసు ఎక్కడుందని భార్యను అడిగిన కారణానికి క్షణికావేశంలో సిమెంట్‌ ఇటుకతో తలపై బాది భర్తను హతమార్చిన సంఘటన ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

wife Brutally Killed Her Husband: బంగారు గొలుసు ఎక్కడుందని అడిగిన కారణానికి క్షణికావేశంలో భార్య సిమెంట్‌ ఇటుకతో బాది భర్తను హతమార్చిన ఘటన ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం ఎల్కలపల్లికి చెందిన చిలుముల సుమన్‌(38) 2009లో అంజలి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అంతకుముందే పొట్యాలకు చెందిన మరదలైన స్పందన(25)ను కూడా ప్రేమించాడు. ప్రేమ విషయం తెలిసి సుమన్‌తో అంజలి విడాకులు తీసుకుంది. స్పందనకు ఓ వ్యక్తితో వివాహం కాగా, మనస్పర్థలతో దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో సుమన్‌ను ఇష్టపడి 2017లో పెళ్లి చేసుకొని ఎల్కలపల్లికి వచ్చారు. కొద్దికాలం తర్వాత ఎన్టీపీసీ పీటీఎస్‌లోని ఓ అధికారి క్వార్టర్‌కు ఆనుకొని ఉన్న సర్వెంట్‌ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న సుమన్‌ ఆటోను అమ్మి వేరే ఆటోను అద్దెకు నడుపుతున్నాడు.

వీరికి పిల్లలు లేరు.. ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్య స్పందనతో గొడవ పడేవాడు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఇద్దరు గొడవకు దిగారు. స్పందన వద్ద ఉండాల్సిన బంగారు గొలుసు ఏమైందని సుమన్‌ నిలదీశాడు. తన అన్న వద్ద ఉందని ఆమె బుకాయిస్తూ వచ్చింది. నిన్న గొడవ పెద్దదై ఆవేశంలో ఆమెను చితకబాదాడు. ఎదురుతిరిగిన స్పందన అక్కడే ఉన్న సిమెంట్‌ ఇటుకతో భర్త సుమన్‌ తలపై బాదింది. తలకు గాయమై కిందపడి స్పృహ కోల్పోయాడు.

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి చూసే సరికి సుమన్‌ మృతిచెంది ఉన్నాడు. ఘటన స్థలాన్ని రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్సైలు జీవన్‌, కుమార్‌ పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. స్పందన ఫోన్‌ను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. మృతుని తండ్రి చిలుముల మధునయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.