ETV Bharat / state

Water flow in Telangana : ఏ ఏ ప్రాజెక్టులల్లో ఎన్ని టీఎంసీల నీరు ఉంది?

author img

By

Published : Jul 23, 2023, 8:54 PM IST

Water flow in Telangana
Water flow in Telangana

Godavari Water Levels in Bhadrachalam : గోదావరితో పాటు ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వస్తుండగా.. భద్రాచలం వద్ద కాస్త ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాదం హెచ్చరిక ఉపసంహరించారు. హైదరాబాద్‌ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

వరద నీటితో నిండిపోయిన ప్రాజెక్టులు

Sri Ram Sagar Project Capacity : రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 26వేల 296 క్యూసెక్కులుగా ఇన్‌ఫ్లో వస్తోంది. 1091 అడుగుల గరిష్ట స్థాయికి గాను 1083.30 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలకు ప్రస్తుతం 61.766 నిల్వ ఉంది.

Nizam Sagar Project Water Depth Today : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5వేల 500 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.18 టీఎంసీలు నీరు ఉంది. జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టులోకి 243 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.630 టిఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 8వేల 507 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 800 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేట్ ద్వారా దిగువకు వదులుతున్నారు.

Irrigation Projects Details in Telangana : ప్రాణహిత ప్రవాహంతో కాళేశ్వరం బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇంద్రావతి సహా ఇతర ఉపనదులు ప్రవాహం తోడై.. భద్రాచలం వద్ద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 42.8 అడుగుల ప్రవాహం ఉండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తొంది. ప్రకాశ్‌నగర్‌ చెక్‌డ్యాం వద్ద మున్నేరు ప్రవాహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరిశీలించారు. ఉద్ధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

Godavari flood: పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Himayat Nagar Highest Water Depth : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలెవల్ వంతెనపై నుంచి మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు వంతెన ఇరువైపులా బారీకెడ్​లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బీబీ నగర్ మండలం రుద్రవెల్లి, భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. 2 గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1,763 అడుగులు ఉండగా.. ప్రస్తుత 1762 అడుగులు ఉంది. హుస్సేన్‌ సాగర్‌లో నీరు పూర్తిస్థాయి ట్యాంక్‌ లెవల్‌ సామర్థ్యానికి 513.41 మీటర్లకు చేరుకుంది. రెండు రోజులగా ఎఫ్​టీఎల్​ లెవల్‌ దాటి నమోదైన హుస్సేన్‌ సాగర్‌ తిరిగి ఎఫ్​టీఎల్ స్థాయికి చేరుకుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.