ETV Bharat / state

Vote from Home in Telangana Elections 2023 : వారందరికీ గుడ్​న్యూస్​.. ఇక ఇంటి నుంచే ఓటు వేసుకునే ఛాన్స్​..

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 9:10 AM IST

Vote from Home in Telangana Elections 2023 : దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఇక నుంచి ఇంటి వద్దే ఓటు వేయవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు వారికి ప్రత్యేక అవకాశం కల్పించింది. ముందుగానే దరఖాస్తు చేసుకున్న అర్హులకు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఓటు నమోదు చేసుకుంటారు. ఇందుకోసం బీఎల్ఓలు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లను కలిసి వారి నుంచి ఫారం 12డీలో వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకుంటే.. వారికి రవాణా సహా కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

Telangana Elections 2023
Vote from Home in Telangana Elections 2023

Vote from Home in Telangana Elections 2023 : మొదటి సారిగా శాసనసభ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటింగ్ అమలు కానుంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వారి ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఇందుకోసం అధికారులు ముందుగానే కసరత్తు పూర్తి చేసి.. ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ఓటింగ్ నమోదు చేయించాల్సి ఉంటుంది. హోమ్​ ఓటింగ్ ప్రక్రియ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 12డీ ఫారాన్ని నింపి రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ)కి ఇవ్వాల్సి ఉంటుంది.

Vote from Home for Senior Citizens : గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే ఓటు వేసుకునే ఛాన్స్.. కానీ చిన్న ట్విస్ట్

ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకం. తమ పరిధిలోని 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల వద్దకు బీఎల్ఓలు వెళ్లి హోమ్​ ఓటింగ్ గురించి వివరించి వారికి 12డీ ఫారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓటరుకు సంబంధించిన అన్ని వివరాలను అందులో నమోదు చేసి వారి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు తమ ధ్రువపత్రాన్ని కూడా జతపర్చాల్సి ఉంటుంది. తమ పరిధిలో వచ్చిన 12డీ ఫారాలన్నింటినీ బీఎల్ఓలు ఏఆర్ఓకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సెక్టార్ ఆఫీసర్ పర్యవేక్షించాలి. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అందులో ఇంటి దగ్గరే ఓటింగ్​కు అర్హులైన వారిని గుర్తిస్తారు. వారిని ఆబ్సెంటీ ఓటర్లుగా పరిగణించి వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేసేందుకు అనుమతిస్తారు. ఈ ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది.

Telangana Assembly Elections 2023 : 'ఆ కేంద్రాల్లో సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి'

రాష్ట్రంలో వచ్చే నెల మూడో తేదీ నుంచి నోటిఫికేషన్ వెలువడుతున్నందున నవంబర్ 4 నుంచి 8వ తేదీలోపు ఆబ్సెంటీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో హోమ్​ ఓటింగ్​కు అర్హులైన వారిని పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తిస్తారు. సెక్టార్లుగా విభజించి సెక్టార్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. ఆ తర్వాత ఆబ్సెంటీ ఓటర్లుగా గుర్తించిన వారి ఇంటి వద్దే ఓటు హక్కు నమోదు చేసేందుకు ఓ షెడ్యూల్ ఖరారు చేస్తారు. సెక్టార్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటు హక్కు నమోదు చేస్తారు. హోమ్​ ఓటింగ్ షెడ్యూల్​కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు కూడా ఇస్తారు. అవసరం అనుకుంటే అభ్యర్థులు వారి ఏజెంట్లను కూడా వెంట పంపవచ్చు.

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

ఓటరు తమ ఓటు హక్కును పూర్తి రహస్యంగా వినియోగించుకునేలా కంపార్ట్​మెంట్ సహా ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూర్తి స్థాయి పోలింగ్ తరహాలో ఆబ్సెంటీ ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రంపై ఓటు నమోదు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పత్రంగా సీల్డ్ కవర్​లో ఉంచుతారు. వాటిని రిటర్నింగ్ అధికారి భద్రపరుస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అన్నింటి లెక్కింపు ఒకేమారు చేపడతారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,43,943 మంది ఉన్నారు. అందులో వందేళ్లకు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. 5,06,493 మంది దివ్యాంగులు ఓటర్లుగా ఉన్నారు. దివ్యాంగులు లేదా సీనియర్ సిటిజన్లు ఎవరైనా పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అందుకు అవసరమైన సహాయ సహకారం, సౌకర్యాలను కూడా కల్పిస్తారు.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

పోలింగ్ కేంద్రాల్లో వారికి అవసరమైన వీల్ ఛైర్లు, ర్యాంపులు, వాలంటీర్లను అందుబాటులో ఉంచుతారు. ఈ తరహా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రవాణా సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. ఇందుకోసం సాక్షం యాప్​లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంధులు తమ వెంట ఒక సహాయకుణ్ని కూడా పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లవచ్చు. వారి కోసం బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలెట్ పత్రాలను కూడా అందుబాటులో ఉంచుతారు. వాటిపై ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకొని సహాయకుని అవసరం లేకుండా కూడా వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

Telangana Assembly Elections 2023 : వేగం పుంజుకున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు.. వాటిపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.