Veerappa moily comments: 'మోదీ పాలనలో ప్రతీ ప్రజాప్రతినిధికీ ఓ రేటు'

author img

By

Published : Oct 19, 2021, 1:56 PM IST

Veerappa moily comments, rajiv gandhi sadbhavana sabha

ప్రపంచలోనే యువ నాయకుడిగా రాజీవ్ గాంధీ పేరు తెచ్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ(Veerappa moily comments) అన్నారు. 18ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత అని గుర్తు చేశారు. అవినీతి నిర్మూలించేందుకు యూపీఏ పాలనలో లోక్ పాల్ బిల్లును తీసుకొస్తే.. దాన్ని అమలు చేయడంలో మోదీ విఫలం అయ్యారని విమర్శించారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ(Rajiv gandhi sadbhavana sabha 2021) ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.

ప్రధాని మోదీ పాలనలో ప్రజాప్రతినిధులకు రేట్లుపెట్టి కొంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ(Veerappa moily comments) ఆరోపించారు. అవినీతి నిర్మూలించేందుకు యూపీఏ(UPA GOVERNMENT NEWS) పాలనలో లోక్ పాల్ బిల్లును తీసుకొస్తే.. దాన్ని అమలు చేయడంలో మోదీ(PM MODI NEWS) విఫలం అయ్యారని విమర్శించారు. లోక్ పాల్ కావాలని కొట్లాడిన.. సంతోష్ హెగ్డే, అన్నా హజారేలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. 2023లో తెలంగాణ, ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో(Rajiv gandhi sadbhavana sabha 2021) ఆయన పాల్గొన్నారు. వీరప్ప మొయిలీకి రాజీవ్‌ సద్భావన అవార్డు ప్రదానం చేశారు.

ప్రపంచంలోనే యంగ్ లీడర్

ప్రపంచలోనే యువ నాయకుడిగా రాజీవ్ గాంధీ పేరు తెచ్చుకున్నారని అన్నారు. 18ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కూడా దేశం కోసం బలయ్యారన్న ఆయన(Veerappa moily comments)... యువ ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. అస్సాం, త్రిపురా, తమిళనాడు రాష్ట్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. వారి సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు.

అవినీతి నిర్మూలన కోసం..

దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు.. అనేక మంది జాతీయ నాయకులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. నేడు అందరూ సంతోషంగా ఉన్నారంటే.. ఆ మహనీయుల త్యాగ ఫలితమేనని అభిప్రాయపడ్డారు(Veerappa moily comments). రాజీవ్ గాంధీ ఐదేళ్ల పరిపాలన ఒక్క స్వర్ణయుగమని పేర్కొన్నారు. అభివృద్ది, ఐక్యత, శాంతి, మత సామరస్యం ఇలా అన్నింటినీ కాపాడుతూ పరిపాలన చేశారని గుర్తు చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు అవినీతి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

ఇదీ చదవండి: Telangana Minister KTR : కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారనే విషయంపై కేటీఆర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.