ETV Bharat / state

Summer Holidays: గుర్తు చేస్తున్న ఈత.. కూత.. ఆట

author img

By

Published : Apr 25, 2023, 3:30 PM IST

SUMMER
SUMMER

Enjoyment in Summer Holidays at Hyderabad: గుర్తు కొస్తున్నాయి.. గుర్తు కొస్తున్నాయి.. ఈ పాటలో రవితేజ తాను చిన్నతనంలో గడిపిన మధుర క్షణాలని గుర్తు చేసుకుంటారు. అలానే హైదరాబాద్ నగర శివారులో కొన్ని ప్రదేశాలకు వెళితే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు కచ్చితంగా గుర్తుకొస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ నుంచి ఎంత దూరం? ఆ ప్రదేశాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి.? ఇలాంటి విషయాల తెలిపేందుకు ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Enjoyment in Summer Holidays at Hyderabad: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎక్కవగా బయట గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇంట్లో వారితో సమయం దొరకడంతో వారు చెప్పిన విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటారు. అలా చెప్పిన వాటిలో కొన్ని.. చిన్నప్పుడు మేము వేసవి సెలవు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాం. అక్కడ చెరువులో, బావిలో ఈత కొట్టేవాళ్లం. మామిడి తోటలోకి వెళ్లి మామిడి కాయలు తెంపే వాళ్లం. స్నేహితులలో నచ్చిన ఆటలు ఆడుకున్నాం. రాత్రి సమయాల్లో డాబాపై ఎక్కి హాయిగా నిద్రించేవారిమి.. ఇలా చాలా విషయాలు పిల్లలతో తల్లిదండ్రులు పంచుకుంటారు.

సొంత ఊరు వెళ్లలేని కోసమే: ఇలాంటి విషయాలు విన్న పిల్లలకు వారికి వేసవి సెలవుల్లో అలా ఆనందంగా గడపాలని అనిపిస్తోంది. దీంతో వారు సొంతూరుకి వెళ్ధామని పేచి చేస్తూంటారు. తల్లి దండ్రులకు ఉన్న పనులు వదిలేసి ఊరికి వెళ్లే ఆలోచనే ఉండదు. వారి ఊరు వెళ్లలేని వారు హైదరాబాద్ నగర శివారులో ప్రైవేట్ ఫామ్​హౌస్​లు, రిసార్డ్​లు, కొన్ని ప్రదేశాల్లో అలాంటి వాతావరణాన్ని కలిపిస్తున్నాయి. దీంతో నగరవాసులు కుటుంబ సమేతంగా వెళుతున్నారు.

హైదరాబాద్ నుంచి 20 -50కిలో మీటర్ల దూరంలోనే: ఔటర్ రింగ్ రోడ్డు దాటితో పల్లె వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ సిటీకి 20 నుంచి 50 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, మొయినాబాద్‌, చేవెళ్ల, వికారాబాద్‌, శంషాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాంహౌస్​లు ఉన్నాయి. పండగ సందర్భంలో, వారాంతాల్లో, ప్రత్రేక విషయాల్లో వ్యక్తులు ఇక్కడికి వచ్చి గడుపుతున్నారు. సొంతూరికి వెళ్లే లేని వారికి.. ఊళ్లో ఉండే పొలాలు, ఇళ్ల లేని వారికి ఫాంహౌస్​లు ఆ లోటును తీరుస్తున్నాయి. సందర్శకులు సంవత్సరం పొడువునా వస్తుంటారు. వేసవిలో ప్రత్యేకంగా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

చిన్నప్పుడు గడిపే క్షణాలు గుర్తుకొస్తాయి: వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోతగా ఉంటుంది. ఎక్కడైనా నీడ కనిపిస్తే అక్కడికి వెళ్లి సేదతీరాలని అనుకొంటాం. పాత రోజుల్లో రాత్రి అయితే ఇంట్లో నిద్రపట్టక.. మేడపైన లేదా ఇంటి వెలుపల నిద్రించేవారు. ఈ ఫామ్​హౌస్​లు, రిసార్టులకు వెళుతున్న వారికి అలాంటి పల్లెటూరి వాతావరణాన్ని పలు సంస్థలు అందిస్తున్నాయి. పామ్​హౌస్​ల్లో రాత్రి పూట నిద్రించేందుకు అవకాశం ఉంది. దీంతో కుటుంబంతో సరదాగా గడిపి ఉదయం తిరిగి వెళుతున్నారు. ఉదయం కోడి కూతతో నిద్ర లేచి.. వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నారు. ఆవు పాలతో తేనీరు సేవిస్తున్నారు. పిల్లలతో కాసేపు హాయిగా అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్​లో ఈత కొడుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న మామిడి పళ్ల రసాన్ని తాగుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఆటలతో వారి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్నారు.

"వుడ్స్ శంషాబాద్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. సందర్శకులు ఆనందంగా గడిపేందుకు క్యాంప్ ఫైర్​లు పెట్టాం. చిన్నతనంలో ఊళ్లో వారు గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తు చేయాలన్నదే మా ఆశయం. మేము సృష్టించిన వాతావరణం ఎన్నో రకాల పక్షులకు నిలయంగా మారింది. ఇదంతా ధరిత్రీ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేశాం." - శరత్‌, వుడ్స్‌ శంషాబాద్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.