ETV Bharat / state

Valantari: నవీన సాగు విధానాలపై వాలంతరిలో శిక్షణ

author img

By

Published : Feb 8, 2022, 12:44 PM IST

Valantari: వాతావరణ మార్పుల నేపథ్యంలో తరిగిపోతున్న సహజ వనరుల లభ్యతలు దృష్టిలో పెట్టుకుని శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నీరు, భూమి యాజమాన్యం శిక్షణ, పరిశోధన సంస్థ - వాలంతరి సన్నద్ధమైంది. వాలంతరి సంస్థలో 15 రోజుల ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులు ప్రారంభించనుంది.

Valantari
Valantari

Valantari: భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నవీన విధానాల్లో సాగుపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు... నీరు, భూమి యాజమాన్యం శిక్షణ, పరిశోధన సంస్థ- వాలంతరి సన్నద్ధమైంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వాలంతరి సంస్థలో 15 రోజుల ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులు ప్రారంభించనుంది.

గ్రామీణ రైతులు, కొత్తగా వ్యవసాయంలో అడుగుపెడుతున్న యువత, ఉద్యోగ, వ్యాపారవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త రకం పంటల పరిచయం, లాభసాటి, సుస్థిర వ్యవసాయం పరిచయం, సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం తదితరాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని వాలంతరి డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. కోర్సు కాల వ్యవధి ఈ నెల 16 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు డైరెక్టర్ జనరల్, వాలంతరి, అకౌంట్ నంబర్:62204844613, ఎస్​బీఐ, ఎన్​ఐఆర్​డీపీఆర్​ ఎక్స్​ రోడ్, రాజేంద్రనగర్, ఐఎఫ్​సీ కోడ్: SBIN0020378కు రుసుం 1,200 రూపాయలు చెల్లించి దరఖాస్తులో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే 7702999802, 8008554268 నంబర్లకు ఫోన్‌లో సంప్రదించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.