ETV Bharat / state

Ravichandra: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం

author img

By

Published : May 30, 2022, 11:05 AM IST

Updated : May 30, 2022, 11:54 AM IST

Vaddiraju Ravichandra
వద్దిరాజు రవిచంద్ర

11:01 May 30

Ravichandra: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం

Ravichandra: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్​లోని రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్​లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు హాజరయ్యారు.

రాజ్యసభ సభ్యుడిగా తెరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నిక బరిలో రవిచంద్ర మాత్రమే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రం నుంచి మరో రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్​లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది.

Last Updated : May 30, 2022, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.