ETV Bharat / city

రాజ్యసభ సభ్యుడిగా గాయత్రి రవి ఏకగ్రీవం

author img

By

Published : May 23, 2022, 5:31 PM IST

Updated : May 23, 2022, 7:50 PM IST

Gayatri Ravi Unanimous: రాజ్యసభ సభ్యుడిగా తెరాస అభ్యర్థి గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. గాయత్రి రవి ఎన్నికను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఉపఎన్నిక బరిలో వద్దిరాజు రవిచంద్ర మాత్రమే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

Gayatri Ravi unanimous to Rajya Sabha
రాజ్యసభకు గాయత్రి రవి ఏకగ్రీవం

Gayatri Ravi Unanimous: రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి గాయత్రి రవి ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికకు ర‌విచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

మిగతా రెండు రాజ్యసభ స్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్‌లో పదవీకాలం ముగియనున్న డీఎస్, లక్ష్మీకాంతరావు స్థానంలో రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. తెరాస అభ్యర్థులు బండి పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు 25న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు.

ఇవీ చదవండి: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు

ఉక్రెయిన్ దూకుడు.. రష్యా కమాండర్​కు జీవిత ఖైదు!

Last Updated :May 23, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.