ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు వ్యాక్సినేషన్

author img

By

Published : Jun 3, 2021, 2:16 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు వ్యాక్సినేషన్
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు వ్యాక్సినేషన్

వ్యాక్సిన్​ తీసుకోవాలనుకున్న డ్రైవర్లు ముందుగా రవాణా శాఖ వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాజ్​భవన్ వద్ద ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్​ను ఆయన ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు వ్యాక్సినేషన్

రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. గ్రేటర్​ హైదరాబాద్​లో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు టీకాలు వేస్తున్నారు. హైదరాబాద్​ రాజ్​భవన్​ వద్ద ప్రభుత్వ పాఠశాలలో టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ప్రారంభించారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో 10 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్​ తీసుకోవాలనుకున్న డ్రైవర్లు ముందుగా రవాణా శాఖ వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం కొనసాగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్​సీ జిరాక్స్ కాపీ తీసుకురావాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి: Heavy rains: ఆగమనానికి ముందే ముంచెత్తిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.