ETV Bharat / state

vaccination: బోయిన్​పల్లి మార్కెట్​లో టీకా కేంద్రం ప్రారంభం

author img

By

Published : May 29, 2021, 9:59 PM IST

Vaccination center, Bowenpally market
వ్యాక్సినేషన్, బోయిన్​పల్లి మార్కెట్ యార్డు

బోయిన్​పల్లి మార్కెట్​లో ఏర్పాటు చేసిన టీకా(vaccination) కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్​, కంటోన్మెంట్ సీఈవో కలిసి ప్రారంభించారు. స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే రైతులు, హమాలీలు, దుకాణాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా బోయిన్​పల్లి మార్కెట్​లో వ్యాక్సినేషన్(vaccination) కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్ శ్రీనివాస్ తెలిపారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే మార్కెట్​లో పనిచేసే హమాలీలు, రైతులు, దుకాణాదారులకు టీకా ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

మార్కెట్​లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని... లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: TS Lockdown: రేపు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.