ETV Bharat / state

కేసీఆర్​ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: యోగి

author img

By

Published : Nov 29, 2020, 4:54 AM IST

up cm yogi adityanath campaign in ghmc elections
కేసీఆర్​ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: యోగి

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం 35 లక్షల మంది పేదలను ఆదుకుంది.. ఇక్కడ సీఎం కేసీఆర్ ఎంత మంది పేదలను ఆదుకున్నాడని.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రశ్నించారు. కేసీఆర్​కు రైతులు, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కేవలం కుటుంబం, ఎంఐఎం పట్ల మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. శాలిబండలోని అల్కా థియేటర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేసీఆర్​ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: యోగి

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శాలిబండలోని అల్కా థియేటర్ మైదానంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన భాగ్యనగర వాసులందరికీ నమస్కారమని​ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భాజపా ప్రభుత్వం అలహాబాద్​ను ప్రయాగ్​రాజ్​గా మార్చిందని.. ఇక్కడ కూడా భాజపా అధికారంలోకి వస్తే.. హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చుతామని యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు. హైదరాబాద్​లో ఏ శౌచాలయం మీద చూసినా.. తండ్రి కొడుకుల ఫోటోలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు కుటుంబం, ఎంఐఎం పట్ల మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు

ట్రిఫుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించాం

రోజురోజుకి భాజపాకు ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో భాజపా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. నిరుపేదలను ఆదుకునేందుకు రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. పీడిత ముస్లిం మహిళలకు ట్రిఫుల్ తలాక్ నుంచి భాజపా విముక్తి కల్పించిందన్నారు. ఎంఐఎం హిందూస్థాన్​లో ఉంటుంది.. హిందూస్థాన్​లో తింటుంది.. కానీ..హిందూస్థాన్ అంటే పడదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు అనుమతి లేకుండా కాశ్మీర్​కు వెళ్లే పరిస్థితి లేదని.. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు కూడా కాశ్మీర్​లో భూములు కొనుగోలు చేసే స్వేచ్ఛను ప్రధాని మోదీ కల్పించారన్నారు. అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయాలని యోగి ఆదిత్యనాథ్​ కోరారు.

ఇదీ చదవండి: అపార్టుమెంట్​వాసులకు 20వేల లీటర్ల ఉచితనీరు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.