ETV Bharat / state

Kishan Reddy: 'అఫ్గానిస్తాన్​లోని ప్రవాస భారతీయులను క్షేమంగా రప్పిస్తాం'

author img

By

Published : Aug 19, 2021, 1:10 PM IST

తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి.. ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబసభ్యులు చింతించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Kishan Reddy
kishan

అఫ్గానిస్తాన్​లో ఉన్న ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో చెప్పారు. అక్కడున్న వారి గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని... వారిని ఇండియాకు తీసుకునివచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

"కాబుల్​లో ఉన్న ప్రతి భారతీయుడిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తుంది. ఇప్పటికే కేంద్ర స్థాయిలో అనేక రకాలైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ పనిలోనే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందర్నీ జాగ్రత్తగా దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తాం."

- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

నరరూప రాక్షసులు అప్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న నాటి నుంచి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు. ఆ తాలిబన్లు ఏ సమయంలో దాడి చేస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు. భారత్​ నుంచి అక్కడకు వెళ్లిన వారిగురించి... ఇక్కడున్న కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తమ వారు ఎప్పుడు ఇండియా వస్తారో అనుకుంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: నిజంగా..! తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంతోషిస్తున్నారా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.