ETV Bharat / state

TTD TICKETS : ఈనెల 28న శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

author img

By

Published : Jan 26, 2022, 10:30 PM IST

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది.

TTD TICKETS
TTD TICKETS

శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లను పొందవచ్చని తెలిపింది.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.