ETV Bharat / state

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్​పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

author img

By

Published : Oct 13, 2022, 12:11 PM IST

Updated : Oct 13, 2022, 1:35 PM IST

ts Highcourt Hearing on Munugode voter list petition adjourned till tomorrow
మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్​పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

12:08 October 13

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్​పై విచారణ

Highcourt Hearing On Munugode Voter List Petition: మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్‌దారు తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలను వినిపించారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా ఓటర్ల నమోదు జరిగిందని న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫార్మ్‌-6ప్రకారం కొత్తగా దాదాపు 25వేల ఓట్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని ఆమె వివరించారు.

ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైందని.. నవంబర్ 3న పోలింగ్ జరుగనుందని ఎన్నికల సంఘం తరపున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. తుది ఓటర్ల జాబితాను ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని హైకోర్టుకు వివరించారు. జనవరి 2021 వరకు రెండు లక్షల22వేల ఓట్లు ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల 38వేల ఓట్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానంకు అవినాశ్ దేశాయ్ తెలిపారు . 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించినట్లు స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు విన్నవించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.

అసలేం జరిగిదంటే: మునుగోడులో ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. తక్కువ సమయంలోనే మునుగోడులో 25 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపించింది.

ఇవీ చదవండి: మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా

మునుగోడులో ఆ​ రోజు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం

హిజాబ్​ నిషేధంపై ఎటూ తేల్చని సుప్రీం.. భిన్న తీర్పులిచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు

Last Updated :Oct 13, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.