ETV Bharat / state

విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తెరాస మద్దతు

author img

By

Published : Aug 5, 2022, 11:13 AM IST

Updated : Aug 5, 2022, 2:04 PM IST

TRS Supports Margaret Alva
TRS Supports Margaret Alva

11:10 August 05

మార్గరెట్‌ అల్వాకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

TRS Supports Margaret Alva : రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్​ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు పార్లమెంట్​ భవనంలో రేపు జరగనున్న ఎన్నికలో మార్గరెట్​ అల్వాకు మద్దతుగా ఓటు వేయనున్నారు.

TRS Supports Opposition Vice President Candidate : పార్లమెంట్​ భవనంలో రేపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రహస్య బ్యాలెట్​ విధానంలో జరగనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం కౌంటింగ్​ నిర్వహించి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికకు లోక్​సభ సెక్రటరీ జనరల్ ఆర్వోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్​ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Last Updated :Aug 5, 2022, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.