ETV Bharat / state

Trs leader cheated woman ఆడపిల్ల పుట్టిందని ముఖం చాటేసిన తెరాస నేత

author img

By

Published : Aug 29, 2022, 5:02 PM IST

Trs leader cheated woman ఆయనో ఓ రాజకీయ నాయకుడు అందరికి మంచి చెప్పాల్సిన తానే అన్యాయానికి పాల్పడ్డాడు. తన భార్య చనిపోయిందని చెప్పి ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెకు గర్భం రావడంతో పరీక్షలు చేయించి ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయించాడు. ఈ విషయమై బాధిత మహిళ నిలదీయగా తన మొదటి భార్య బతికే ఉందన్న నిజాన్ని బయటపెట్టాడు. ఈ క్రమలో ఆ మహిళ ఆడపిల్లకు జన్మనివ్వడంతో అతడు ముఖం చాటేశాడు.

దుర్గయ్య
దుర్గయ్య

Trs leader cheated woman: ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తనను వదిలేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన తెరాస నేత, మాజీ ఎంపీటీసీ ముక్కముల దుర్గయ్య తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి.. 2018లో విజయను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఆమెను వేరే ఊరిలో కాపురం ఉంచాడు.

ఆ తర్వాత విజయ గర్భవతి అని తెలియడంతో దుర్గయ్య ఆమెకు టెస్ట్​లు చేయించాడు. పరీక్షలో ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో తన మొదటి భార్య బతికే ఉందని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. కొడుకు కోసమే రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో విజయ అతడిపై 2020లో రామన్నపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును వెనక్కు తీసుకోమని దుర్గయ్య విజయను కోరాడు. మరలా కలిసి ఉందామని ఆమెను నమ్మించాడు.

ఈ క్రమంలో విజయ మరోసారి గర్భవతి అయింది. ఫిబ్రవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి దుర్గయ్య ఆమెను పట్టించుకోలేదు. ఈ క్రమంలో న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించిన వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే హెచ్​ఆర్సీని ఆశ్రయించానని విజయ వాపోయింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలు తనకు ఉన్నాయని ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నాడని ఆమె చెప్పింది. ఇప్పటికైనా తనకు, తన పాపకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజయ కమిషన్​ను కోరింది.

"నా పేరు విజయ తన భర్త తెరాస నేత, మాజీ ఎంపీటీసీ ముక్కముల దుర్గయ్య. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గర్భవతినని తెలియడంతో పరీక్షలు చేయించి ఆడపిల్ల అని రెండుసార్లు అబార్షన్ చేయించాడు. మరోసారి గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనివ్వడంతో తన దగ్గరకి రాకుండా ముఖం చాటేశాడు. అతనికి ఎమ్మెల్యే, మంత్రి అండదండలు ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు. ఎవ్వరూ ఏమీ చేయలేరని అంటున్నాడు. ఇప్పటికైనా నాకు, నా పాపకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్​ను కోరడం జరిగింది. -విజయ, బాధిత మహిళ

ఆడపిల్ల పుట్టిందని ముఖం చాటేసిన తెరాస నేత

ఇవీ చదవండి: కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం, ఏ క్షణమైనా పార్టీ శిథిలం

హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.