ETV Bharat / state

'పోలీస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో హైకోర్టు తీర్పు అమలు చేయాలి'

author img

By

Published : Dec 18, 2022, 6:41 AM IST

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Letter To CM KCR : పోలీస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

Revanth Reddy Letter To CM KCR: హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్‌ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షల్లో ఏడు ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శనివారం బహిరంగ లేఖ రాశారు. ప్రిలిమినరీ రాత పరీక్షల్లో కానిస్టేబుల్‌, ఎస్సై ప్రశ్నపత్రాల్లో చెరో ఏడు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నాయని, దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులు ఇచ్చారని, మరికొందరికి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ 7 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించిందన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ ప్రీతం ఆధ్వర్యంలో శనివారం రాత్రి గాంధీభవన్‌లో క్రిస్‌మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌కుమార్‌గౌడ్‌, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌, శివసేనారెడ్డి, సునీతారావు తదితరులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.