ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @9PM

author img

By

Published : Jul 13, 2022, 8:58 PM IST

Telangana News Today
టాప్​న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఎక్కడా ప్రాణహాని జరగకుండా సత్వర చర్యలు

భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • మరో 3 రోజులు బంద్‌

TS SCHOOLS: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించింది. ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

  • ఎడతెరపిలేని వర్షాలు.. చిగురుటాకుల్లా వణుకుతున్న జిల్లాలు

Tealangana Heavy Rains: వారంరోజులుగా ఏకాధిటి వర్షాలకు దక్షిణ తెలంగాణ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వానలకు పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. చెట్లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

  • రెయిన్ ఎఫెక్ట్... ఈనెల 17 వరకు పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపట్నుంచి ఈనెల 17వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లనూ రద్దు చేశారు.

  • రిమాండ్​ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

Nageswararao case: మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వరరావు కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు ఏసీపీ తెలిపారు. వివాహితపై అత్యాచారం కేసులో నేరాన్ని అంగీకరించినట్లు వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు.

  • ప్రికాషన్​ డోస్ ఇక ఫ్రీ.. వారికి మాత్రమే!

Covid vaccine precaution dose free: కొవిడ్ టీకా ప్రికాషన్ డోసును ఈనెల 15 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 18-59 ఏళ్ల వయసు వారు ఇందుకు అర్హులని తెలిపింది.

  • 'బుల్డోజర్లతో కూల్చివేతలను నిషేధించలేం'

Bulldozer Demolitions Supreme Court: అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే ప్రక్రియపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్‌ అధికారుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని పేర్కొంది. మరోవైపు, 'అగ్నిపథ్' పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జులై15న వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

  • భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

Maharastra Heavy Rains: గతకొద్ది రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. హింగోలి జల్లాలోని ఓ గ్రామంలో వరదల ధాటికి సుమారు 300 కుటుంబాల ప్రజలు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు, పాల్​ఘర్​ జిల్లాలో ఓ ఇంటిపై కొండచరియ విరిగి పడడం వల్ల తండ్రీకూతుళ్లు అక్కడిక్కడే మరణించారు.

  • మొదటి భార్య పేరు కలిసేలా.. దిల్​రాజు కొడుకు పేరు..!

స్టార్​ ప్రొడ్యూసర్​ దిల్​రాజు సతీమణి తేజస్విని ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. తాజాగా ఆ చిన్నారికి పేరు పెట్టేశారట. అయితే తన మొదటి భార్య పేరు కలిసేలా.. కొడుకు పేరు పెట్టారట దిల్​రాజు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే?

  • వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.