ETV Bharat / sports

ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

author img

By

Published : Jul 13, 2022, 4:51 PM IST

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.

Bumrah back to No.1 in ICC ODI Player Rankings
వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బౌలింగ్‌ విభాగంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలివన్డేలో 6 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కి నెగ్గి మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు.

ఐసీసీ వన్డే బౌలింగ్‌ విభాగంలో రెండేళ్లు అగ్రస్థానంలో కొనసాగిన బుమ్రా 2020 ఫిబ్రవరిలో మొదటి ర్యాంక్‌ కోల్పోయాడు. మళ్లీ ఇప్పుడు అగ్రపీఠం అధిరోహించాడు. మొత్తంగా 730 రోజులు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బౌలింగ్‌ విభాగంలో నంబర్‌-1 ర్యాంక్‌లో కొనసాగి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా ఖ్యాతినార్జించాడు. గతంలో టీ20ల్లో కూడా నంబర్‌-1 బౌలర్‌గా ఉన్న బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.

కపిల్ దేవ్ తర్వాత.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన భారత రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం గమనార్హం. ఇంగ్లాండ్​తో జరిగిన వన్డేలో మూడు వికెట్లతో సత్తా చాటిన షమీ మూడు ర్యాంకులు ఎగబాకి.. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి 23వ స్థానాన్ని పంచుకున్నాడు.

టాప్​10లో ఉన్నది వీరే..: .1.జస్‌ప్రీత్‌ బుమ్రా(భారత్​), 2.ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌), 3.షాహిన్‌ ఆఫ్రిది(పాకిస్థాన్‌), 4.జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), 5.ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌(అఫ్గనిస్థాన్‌), 6.మెహెదీ హసన్‌(బంగ్లాదేశ్‌), 7.క్రిస్‌ వోక్స్‌(ఇంగ్లాండ్‌), 8. మ్యాట్‌ హెన్రీ(న్యూజిలాండ్‌), 9.మహ్మద్‌ నబీ(అఫ్గనిస్థాన్​‌), 10. రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్థాన్‌).

టీ20లో ఐదో స్థానానికి సూర్య..

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో అదరగొట్టిన సూర్యకుయార్‌ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్​ తన కెరీర్​లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో 44 ర్యాంకులు ఎగబాకి.. ఐదో స్థానంలో నిలిచాడు. సూర్య మొత్తం 732 పాయింట్లు సాధించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టీ20 మ్యాచ్​లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 212 స్ట్రైక్‌రేటుతో 117 పరుగులతో అదరగొట్టాడు సూర్య. సూర్య మినహా మరే ఇతర భారత బ్యాటర్‌కు టాప్‌-10లో చోటు దక్కలేదు.

టాప్​10లో ఉన్నది వీరే..: 1.బాబర్‌ ఆజమ్‌(పాకిస్థాన్​), 2. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్థాన్‌), 3.ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా), 4. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్‌), 5. సూర్యకుమార్‌ యాదవ్‌( భారత్​), 6.ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా), 7. డెవాన్‌ ​కాన్వే(న్యూజిలాండ్‌), 8.నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌), 9.పాథుమ్‌ నిశాంక(శ్రీలంక), 10. మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌), రసీ వాన్‌ డెర్‌ డసెన్‌(దక్షిణాఫ్రికా)

ఇదీ చదవండి: కేఎల్​ రాహుల్​తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.