ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @9AM

author img

By

Published : Aug 10, 2022, 9:00 AM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద ఘోర ప్రమాదం ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు.

  • 'మహా' కొత్త కూటమిలో లుకలుకలు..

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా, అసమ్మతి శివసేన కూటమి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాఠోడ్​కు పదవి ఇవ్వడంపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, రాఠోడ్​ను మంత్రివర్గంలోకి చేర్చుకోవడాన్ని సీఎం శిందే సమర్థించుకున్నారు. కూటమి ఏర్పడి రెండు నెలలు కాకముందే ఇలా లుకలుకలు బయటపడటం గమనార్హం.

  • కాలుష్య నియంత్రణ మండలిలో భారీగా బదిలీలు..

State Pollution Control Board: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో భారీ ప్రక్షాళన జరిగింది. ఇంజినీర్లు, సైంటిఫిక్‌ స్టాఫ్‌లో దాదాపు 80 శాతం మందిని బదిలీ చేశారు. ఈ మేరకు పీసీబీ సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అధికారులు, ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పది మంది రీజనల్‌ అధికారులనూ బదిలీ చేశారు.

  • కృష్ణమ్మ గలగలలు.. గోదారి ఉరకలు

Godavari Krishna Flood: కృష్ణా గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి నాగార్జునసాగర్‌ గేట్లు గురువారం తెరచుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

  • ఆగమేఘాలపై దేశవిభజన.. పుస్తకాలనూ చించేసి..

Azadi ka amrit mahotsav: అనుకోని విభజన, అనూహ్య వలసలు, ఆగని అల్లర్లు... అంతా అతలాకుతలం... ముంచుకొస్తున్న స్వాతంత్య్ర ముహూర్తం... పూర్తిగా గందరగోళం... అలాంటి వేళ ఆస్తుల పంపకం ఎంత కష్టం? అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది నాటి నాయకత్వం! 70 రోజుల్లో అన్ని విభాగాలు, శాఖల వారీగా ఆస్తులు, అప్పుల విభజన, పంపకాలు చేశారు. ఈ పంపకం ఆసక్తికరమే కాదు... దేశ విభజనలా ఆవేదనాభరితం కూడా!

  • బికినీ ధరించిన ప్రొఫెసర్‌.. రూ.99కోట్ల ఫైన్

కోల్​కతాలోని ఓ యూనివర్సిటీ.. తమ విద్యాసంస్థలో పనిచేస్తున్న మహిళా ప్రొఫెసర్​ను రూ.99 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బికినీ ధరించి ఇన్​స్టాగ్రామ్​లో ఫొటోలు పెట్టినందువల్ల యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొంది. దీంతో ప్రొఫెసర్​ను ఉద్యోగం నుంచి తొలగించింది.

  • పుతిన్ ఆక్రమణ యత్నాలకు గండి..

Russia Ukraine guerilla warfare: ఉక్రెయిన్​లోని తూర్పు ప్రాంతాన్ని తమలో కలిపేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలు ఫలించడం లేదు. గెరిల్లా దళాలు రష్యాను ముప్పతిప్పలు పెడుతున్నాయి. రష్యా అనుకూల అధికారులను హత్య చేస్తున్నాయి. అదేసమయంలో ఉక్రెయిన్ సైన్యానికి కీలక సమాచారం అందించి.. గురి తప్పకుండా దాడి చేసేలా పురిగొల్పుతున్నాయి.

  • షుగర్​ ఉన్నవాళ్లు మద్యం తాగొచ్చా?

Sugar Patients Alcohol: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు మద్యం తాగుతుంటారు. అయితే మధుమేహులు.. మద్యం తాగాక షుగర్​ మందులు వేసుకోవచ్చా? సాధారణంగా మద్యం తాగాక ఏవైనా మాత్రలు వేసుకోవచ్చా? దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? ఈ సందేహలన్నింటిపైన నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

  • ఈ అథ్లెట్లకు ఆకాశమే హద్దు.. కష్టాల కడలి దాటి..

కామన్వెల్త్‌ క్రీడలు ముగిశాయి. అందులో మన దేశం నుంచి 61 మంది పతక విజేతలు. వీళ్లందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వీళ్లందరి జీవితం పూల పాన్పేమీ కాదు. ఒకరు రైతు బిడ్డ.. ఇంకొకరు ఛాయ్‌వాలా.. ఒకరు మూటలు మోశారు.. మరొకరు గడ్డి కోశారు.. ఒకరికి తండ్రి లేడు.. మరొకరికి చేతుల్లో డబ్బు లేదు! అందరూ మనలాంటి వాళ్లే. వాళ్లకూ మనలాంటి అడ్డంకులే! కానీ వాళ్లు అందరిలా మిగిలిపోలేదు. ఏ అడ్డంకీ వారి విజయాన్ని ఆపలేదు! వారిని మిగతా అందరి నుంచి భిన్నంగా నిలిపింది వారి పట్టుదల.. సంకల్ప బలం! వాళ్లు గెలిచింది ఆటల్లో కావచ్చు. కానీ స్ఫూర్తినిచ్చేది మాత్రం అందరికీ! ‘ ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు నెగ్గిన చాలామంది స్ఫూర్తి గాథలివి. వారి గురించి తెలుసుకుందాం..

  • అప్పుడు చాలా బాధేసింది.. : నితిన్

Nithin Macharla Niyojakavargam: హీరో నితిన్ నటించిన కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలిపారాయన. కెరీర్​లో తాను ఎదుర్కొన్న విమర్శలు, ఆ సమయంలో ఎవరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లారు సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.