ETV Bharat / state

Telangana News Today: టాప్‌న్యూస్ @1PM

author img

By

Published : Jul 2, 2022, 12:59 PM IST

టాప్‌న్యూస్ @1PM
టాప్‌న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • భాగ్యనగరానికి సిన్హా.. కేసీఆర్‌ స్వాగతం

విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు. బేగంపేట నుంచి సిన్హా జలవిహార్‌ వరకు భారీగా ర్యాలీతో వెళ్లారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహిస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలో పాల్గొనడానికి సిన్హా నగరానికి వచ్చారు.

  • పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా

హైదరాబాద్‌ నగరంలో హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఇవాళ ఉదయం ప్రారంభించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీపం వెలిగించి ఈ సమావేశానికి శ్రీకారం చుట్టారు.

  • 'చంద్రబాబుపై పోటీనా... నేనా..!?'

తెదేపా అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజక వర్గం‌ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం‌ ట్రెండింగ్​గా మారటంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

  • కోర్టుకు జుబైర్.. కస్టడీ కోరిన పోలీసులు

Mohammed Zubair tweet: ఐదురోజుల కస్టడీ విచారణ పూర్తైన నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్​ను.. పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. జుబైర్​ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. మరోవైపు, తనకు బెయిల్ ఇప్పించాలని జుబైర్.. న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

  • ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య..

కేరళలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక కష్టాలే వీరి ఆత్మహత్యలకు కారణమా? లేకే వేరే ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

  • రోబోటిక్ రథంలో జగన్నాథుడిని ఊరేగింపు

రోబోటిక్ రథాన్ని తయారు చేశారు గుజరాత్​లోని వడోదరకు చెందిన జై మక్వానా అనే యువకుడు. అందులో జగన్నాథ స్వామిని ఊరేగింపుగా రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్ర.. సైన్స్- సంప్రదాయాల సమ్మేళనమని చెబుతున్నాడు జై మక్వానా. ఈ కార్యక్రమంలో అతని కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

  • తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు..

Shooting America: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఫ్లాయిడ్ కౌంటీలోని కెంటుకీ ప్రాంతంలో ఓ ఇంట్లో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు.

  • ఈ టిప్స్​తో ఆర్థిక సమస్యలు దూరం చేసుకోండి..

Financial Health Tips: 'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నది నానుడి. కానీ, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా.. డబ్బు కావాల్సిందే. అందుకే, ఆర్థికారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి ఆర్థికంగా ఇలా ఉండాలి అని నిర్ణయించే కచ్చితమైన సూత్రాలేమీ ఉండవు. కొన్ని నియమాలను పాటిస్తే.. ఇబ్బందులు ఎదురవ్వవు అని మాత్రం చెప్పొచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

  • నయా 'వీరు'డు పంత్​ రికార్డుల మోత..

సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే కాస్త ఓర్పు కావాలంటారు.. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాలి. నిలకడగా ఆడి రన్స్ చేస్తేనే జట్టులో స్థానం పదిలంగా ఉంటుంది. కానీ ఇవేవీ ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌కు నచ్చేవి కావు. ఇప్పుడు ఈ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ కూడా అంతే.. అయితే ఒకవైపు కీలకమైన సమయాల్లో అనవసర షాట్లకు పోయి ఔట్‌ అవుతున్నాడనే విమర్శలు చెలరేగుతున్నా.. తన దూకుడును మాత్రం తగ్గించేదేలే అంటూ విరుచుకుపడటం నయా 'వీరు'డు రిషభ్‌ పంత్‌ స్టైల్‌. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో పంత్​ తిరగరాసిన రికార్డుల వివరాలు ఓ సారి చూద్దాం.

  • 'లైగర్'​​ పోస్టర్​.. బోల్డ్​ లుక్​లో విజయ్​దేవరకొండ

VijayDevarkonda Sexiest poster: లైగర్ మూవీటీమ్​ ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్​​ ఇచ్చింది. విజయ్​దేవరకొండకు సంబంధించిన ఓ షాకింగ్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. నెట్టింట్లో ఈ పోస్టర్​ తెగ ట్రెండ్​ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.