ETV Bharat / state

చురుగ్గా రుతుపవనాల కదలిక.. రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు

author img

By

Published : Jun 29, 2022, 8:31 AM IST

Weather update in Telangana: తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

today Weather update in Telangana
రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు

Weather update in Telangana: మధ్యప్రదేశ్‌ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి.

అత్యధికంగా అశ్వాపురం(భద్రాద్రి జిల్లా)లో 10 సెంటీమీటర్లు, జూలూరుపాడులో 8.5, మంచిప్ప(నిజామాబాద్‌)లో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెం.మీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో 5.4, అల్వాల్‌ కొత్తబస్తీ 5.3, కంది 5, మహేశ్‌నగర్‌లో 4.4 సెం.మీ.వర్షం కురిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.