ETV Bharat / state

PV Narasimha Rao: పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు స్థలం పరిశీలిన

author img

By

Published : Jun 3, 2021, 9:06 PM IST

పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కేశవరావు, ఎమ్మెల్సీ వాణీదేవి, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పీవీ విగ్రహ ఏర్పాటు కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఈనెల 28న ఆయన విగ్రహాన్ని హైదరాబాద్​లో ఆవిష్కరించనున్నారు.

PV Narasimha Rao
పీవీ నరసింహారావు

మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఈనెల 28న ఆయన విగ్రహాన్ని హైదరాబాద్​లో ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఏర్పాటు కోసం అనువైన స్థలాలను పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కేశవరావు, ఎమ్మెల్సీ వాణీదేవి, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పరిశీలించారు.

పీవీ నరసింహారావు మార్గ్​గా పేరు మార్చిన నెక్లెస్ రోడ్​ను సందర్శించారు. అనంతరం విగ్రహ ఏర్పాటు కోసం వివిధ స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కేశవరావు తెలిపారు.

ఇదీ చదవండి: covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.