ETV Bharat / state

దయనీయంగా మారిన ధాన్యం రైతుల పరిస్థితి

author img

By

Published : May 19, 2021, 9:22 AM IST

క్షేత్రస్థాయిలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు ఎదురుచూస్తూ.. తీరా కాంటా వేశాక లారీల్లో ఎక్కించేంత వరకు ఆ బస్తాలకు కాపలా ఉంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరుగు లెక్కలు తేలేంత వరకు ధాన్యాన్ని దింపుకోమని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. ధాన్యం దింపుకున్నట్లు వారు ధ్రువీకరిస్తే తప్ప రైతులకు సొమ్ము అందడం లేదు. ఇలా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన నాటి నుంచి రైతు ఖాతాలో సొమ్ము జమ అయ్యేందుకు దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు సమయం పడుతోంది.

hardships of grain farmers
ధాన్యం రైతుల కష్టాలు

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిధులకు లోటు లేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని మరీ ప్రభుత్వం నిధులు సిద్ధం చేసింది. అయినా చెల్లింపుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఇంత జరుగుతున్నా ఎందుకు ఇలా అవుతోందని పట్టించుకునే వారే కరవయ్యారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో చెల్లింపులు చేయాలని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొనుగోలు చేసిన ధాన్యం విలువకు, రైతులకు చేసిన చెల్లింపులకు మధ్య సుమారు 45 నుంచి 50 శాతం వ్యత్యాసం ఉండటమే ఇందుకు నిదర్శనం.

మిల్లర్ల దోపిడీ లెక్కలు కొలిక్కి రాకనే జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. క్షేత్రస్థాయిలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు ఎదురుచూపులు.. తీరా కాంటా వేశాక లారీల్లో ఎక్కించేంత వరకు ఆ బస్తాలకు కాపలా.. మిల్లులకు వెళ్లిన తరవాత అక్కడ తరుగు లెక్కలు తేలేంత వరకు మిల్లర్లు వాటిని దింపుకోరు.. ధాన్యం దింపుకున్నట్లు వారు ధ్రువీకరిస్తే తప్ప రైతులకు సొమ్ము అందదు.. ఇలా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన నాటి నుంచి రైతు ఖాతాలో సొమ్ము జమ అయ్యేందుకు దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు పడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు.

మిల్లర్లు ధ్రువీకరిస్తేనే రైతులకు చెల్లింపులు
ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు చేపట్టినా మిల్లర్లు ధ్రువీకరించాల్సిన పరిస్థితి. ధాన్యంలో తేమ శాతం, తాలు నిర్ధారించాకే కొనుగోళ్లు జరుపుతున్నారు. మిల్లుల్లో మరో దఫా ఆ ధాన్యాన్ని పరీక్షిస్తున్నారు. ఆ తరవాత సమయం తీసుకుని మిల్లర్లు ప్రభుత్వం అందచేసిన ట్యాబ్‌(మినీ ల్యాప్‌టాప్‌)లో నమోదు చేస్తారు. అప్పటికి గానీ చెల్లింపులకు రంగం సిద్ధం కాదు. ఈ క్రమంలోనే మిల్లుల వద్ద జరుగుతున్న జాప్యాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నించడం లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు ఇలా..

* కొనుగోళ్లు: 42.48 లక్షల మెట్రిక్‌ టన్నులు
* మిల్లులకు తరలింపు: 39.64 మె.ల. టన్నులు
* కొన్న ధాన్యం విలువ: రూ.8,013 కోట్లు
* మిల్లర్లు ఇప్పటి వరకు ధ్రువీకరించిన ధాన్యం విలువ: రూ.4,405 కోట్లు
* విడుదల చేసిన నిధులు: రూ.4,262 కోట్లు

ఇదీ చదవండి: అమ్మలా ఆదరిస్తున్నారు.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.