ETV Bharat / state

తెరాస ప్రభుత్వానికి కౌంట్​డౌన్ ప్రారంభం: తరుణ్​చుగ్

author img

By

Published : Jun 25, 2022, 5:27 PM IST

tharunchug: తెరాస ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్​చుగ్ పేర్కొన్నారు. ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్​కు సమయం ఉందన్నారు. ఆ తర్వాత భాజపా అధికారంలోకి వస్తుందని తెలిపారు.

తెరాస ప్రభుత్వానికి కౌంట్​డౌన్ ప్రారంభమైంది: తరుణ్​చుగ్
తెరాస ప్రభుత్వానికి కౌంట్​డౌన్ ప్రారంభమైంది: తరుణ్​చుగ్

తెరాస ప్రభుత్వానికి కౌంట్​డౌన్ ప్రారంభమైంది: తరుణ్​చుగ్

tharunchug: తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని.. కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్​చుగ్ ఆరోపించారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న తరుణ్​చుగ్​.. కేసీఆర్ పాలనపై "సాలు దొర.. సెలవు దొర" వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్​కు సమయం ఉందని.. ఆ తర్వాత భాజపా అధికారంలోకి వస్తుందని తరుణ్​చుగ్ పేర్కొన్నారు. జులై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్​లో భారీ సభ నిర్వహిస్తున్నామన్న ఆయన.. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని చెప్పడానికే ఈ సభ పెడుతున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దళిత బంధు ఏమైంది, 2 పడక గదుల ఇళ్లు ఏమయ్యాయి. కేసీఆర్ పాలనపై 'సాలు దొర-సెలవు దొర' వెబ్​సైట్​ ప్రారంభిస్తున్నాం. జులై 3న పరేడ్ గ్రౌండ్​లో భారీ సభ ఉంది. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేస్తున్నాం.-తరుణ్​చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

ఇదీ చూడండి..

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు

8వ అంతస్తు పిట్టగోడపై కూర్చొని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.