ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM

author img

By

Published : Dec 14, 2022, 6:57 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS

  • Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 14) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

  • దిల్లీలో నేడే బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం..

తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా అందించేడమే లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... నేడు దిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 47 కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలు ఎంపీలు హాజరుకానున్నారు. ఇవాళ నిర్వహించే రాజశ్యామల, నవచండీయాగాల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నారు.

  • డెంటిస్ట్ అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌ మన్నెగూడలో దంతవైద్యురాలి అపహరణకేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అతడి వద్ద నుంచి అయిదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు

సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేశారు.

  • ఖండాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భారతీయ యువకుడు, జర్మనీ యువతి

భారతీయ​ యువకుడు.. జర్మన్​ యువతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వేడుకలు ఎక్కడ జరిగాయంటే?

  • ఐపీఎస్​పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..

ఝార్ఖండ్​లో ఓ గిరిజన మహిళపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఆమె హైకోర్టులో హాజరు కావడానికి కొన్ని గంటల ముందే.. ఆమెపై దాడి జరిగింది. దీంతో ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • సరిహద్దులో ఘర్షణపై స్పందించిన చైనా.. ఏం చెప్పిందంటే?

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో డిసెంబర్‌ 9న భారత్‌ దళాలాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి స్థిరంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. అన్ని ఒప్పందాలను భారత్‌ అమలు చేయాలని కోరింది.

  • IND VS BAN: టెస్ట్​ సమరానికి రంగం సిద్ధం.. టీమ్​ఇండియా ఏం చేస్తుందో?

పసికూన అనుకొంటే రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది​. తాజాగా మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. అదే బంగ్లాదేశ్​. బుధవారం నుంచి టీమ్​ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్​లో గాయాల బాధ వెంటాడుతున్న టీమ్‌ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.

  • మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్.. ఎవరికి ఏ కలర్ ఇస్తారంటే?

ఇప్పటిదాకా బ్లూ కలర్​లో ఉన్న ట్విట్టర్ వెరిఫికేషన్‌ మార్క్‌ ఇప్పుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలన్​ మస్క్​ పేర్కొన్నారు. అలానే ట్విటర్‌ సంస్థలో 'ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌'ను యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

  • ఇటు రాజమౌళి, కమల్‌ హాసన్‌.. అటు రిషబ్‌ శెట్టి, దుల్కర్‌.. ఒకే చోట కలిసి..

ప్రముఖ దర్శకులు రాజమౌళి, లోకేశ్‌ కనగరాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు ఒకే చోట చేరితే ? రిషబ్‌, దుల్కర్‌, జాన్వీ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ సంగతేంటో తెలుసుకుందామా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.