ETV Bharat / state

ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 90.40శాతం ఓటింగ్​ నమోదు

author img

By

Published : Mar 13, 2023, 5:39 PM IST

Updated : Mar 13, 2023, 7:56 PM IST

teacher MLC election
teacher MLC election

MLC Teacher elections in Telangana 2023: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ​ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్​ సాయంత్రం 4 గంటల సమయానికి ముగిసింది. పోలింగ్​ ముగిసే సమయానికి సరాసరిగా 90.40శాతం ఓటింగ్​ నమోదైంది. అనంతరం బ్యాలెట్​ బాక్సులను సరూర్​నగర్​లోని ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

MLC Teacher elections in Telangana: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ పక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్​ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా కొనసాగినట్లు అధికారులు ప్రకటించారు.

2023 Teacher MLC Elections polling: మధ్యాహ్నం 2 గంటల సమయానికి 75 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించిన అధికారులు సాయంత్రం 4 గంటల సమయానికి దాదాపు 90.40 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. పోలింగ్​ ముగిసే సమయానికి మహబూబ్ నగర్ జిల్లాలో 87.75 శాతం , నాగర్ కర్నూల్ జిల్లాలో 93.96, వనపర్తి జిల్లాలో 93.48, గద్వాల్ జిల్లాలో 97.15, నారాయణపేట్ జిల్లాలో 93.77, రంగారెడ్డి జిల్లాలో 86.90, వికారాబాద్ జిల్లాలో 94.76 , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 83.54 , హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. సరాసరిగా 90.40శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు అధికారకంగా ప్రకటించారు.

పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను హైదరాబాద్​లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతను రాచకొండ సీపీ చౌహాన్‌ పర్యవేక్షించారు. హైదరాబాద్​లోని బేగంపేట్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్​లను రాష్ట్ర ఎన్నికల కమీషనర్​ వికాస్ రాజ్ పరిశీలించారు. అధికారులను సమన్వయం చేస్తూ పలు సూచనలు చేశారు. ఈనెల 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

MLC Elections in Andhra Pradesh: మరోవైపు ఆంధ్రప్రదేశ్​లోనూ పట్టభద్ర, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్​ జరుగుతోంది. పోలింగ్‌ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ, వైఎస్​ఆర్​సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని సెయింట్‌ థెరిసా పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం ఘర్షణకు దిగి దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చదవండి:

ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయండి: కేటీఆర్‌

దిల్లీ లిక్కర్ స్కామ్.. అరుణ్​ పిళ్లై కస్టడీ 3 రోజుల పాటు పొడిగింపు

ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని కండక్టర్‌ ఆత్మహత్య

Last Updated :Mar 13, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.