ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్.. అరుణ్​ పిళ్లై కస్టడీ 3 రోజుల పాటు పొడిగింపు

author img

By

Published : Mar 13, 2023, 4:26 PM IST

Liquor scam
Liquor scam

Delhi Liquor Scam Latest Update: దిల్లీ లిక్కర్​ స్కామ్​లో అరుణ్ పిళ్లై కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు. ఈడీ కోరిన పిళ్లై కస్టడీ 3 రోజులపాటు పొడిగించాలనే పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈనెల 16 వరకు కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15న బుచ్చిబాబుతో కలిపి పిళ్లైను మరోసారి విచారించనున్నారు.

Delhi Liquor Scam Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన అరుణ్​ పిళ్లైను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేటితో పిళ్లై కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే మరో మూడు రోజుల పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మార్చి 16 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కేసు విచారణ మార్చి 16కు వాయిదా వేసింది.

మనీలాండరింగ్​కు సంబంధించిన సౌత్ గ్రూప్​లోని వ్యక్తులను కూడా ప్రశ్నించాల్సి ఉందన్న ఈడీ.. ఈ క్రమంలో పిళ్లై కస్టడీ పొడిగించాలని పేర్కొంది. లిక్కర్ పాలసీ హోటల్ సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ పిళ్లై ఫోన్​లోకి ఎలా వచ్చిందనే అంశాలపై ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు వివరించింది. అదే విధంగా మార్చి 9న బుచ్చిబాబును ఈడీ విచారణకి రావాలని కోరగా... మార్చి 13 వరకు సమయం కోరారని తెలిపింది. దాంతో ఈ నెల 15న బుచ్చిబాబును ప్రశ్నించబోతున్నట్లు ఈడీ వెల్లడించింది. బుచ్చిబాబుతో కలిపి అరుణ్ రామచంద్ర పిళ్లైను విచారించాల్సి ఉందని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. బుచ్చిబాబుతో కలిపి అరుణ్​ పిళ్లైను వాట్సప్ చాట్స్ గురించి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది.

ఇప్పటికే ఈడీ 29 సార్లు అరుణ్​ పిళ్లైను విచారణకి పిలిచి 11 సార్లు స్టేట్​మెంట్ రికార్డు చేసిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్లై ఈ కేసు విచారణకి సహకరించారన్న న్యాయవాది.. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే విచారణలో న్యాయవాది కూడా ఉండాలని కోర్టుకు వివరించారు. గత వారం కస్టడీతో కలిపి 36 సార్లు రామచంద్ర పిళ్లై కేసు విచారణకి హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. హోటల్ రికార్డులు చూపించి లిక్కర్ కేసు అరుణ్​ పిళ్లైకి ఆపాదించాలని చూస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో చాలా కీలక సమయంలో అరుణ్​ పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణ కోసం అప్లికేషన్ దాఖలు చేశారని ఈడీ కోర్టుకు వివరించింది. పిళ్లై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సమయంలో పిళ్లైతో పాటు అతని న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనను ఈడీ వ్యతిరేకించింది. ఇప్పుడు స్టేట్​మెంట్ వెనక్కి తీసుకుంటామంటున్నారు... కానీ బలవంతం చేసి పిళ్లై స్టేట్​మెంట్ రికార్డు చేయలేదని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పిళ్లై వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అన్ని నిబంధనలు పాటించామన్న ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్.. భయపెట్టి, బలవంతం చేసి ఆయన వాంగ్మూలం తీసుకోలేదని కోర్టుకు వివరించింది.

మొదటిసారి గతేడాది సెప్టెంబర్ 18న అరుణ్​ పిళ్లై స్టేట్​మెంట్ రికార్డు చేశామని ఈడీ తెలిపింది. ముడుపుల వ్యవహారంలో పిళ్లై కీలకపాత్ర పోషించారని పేర్కొన్న ఈడీ.. ముడుపుల్లో ప్రధాన పాత్ర దారి ఆయనే అని స్పష్టం చేసింది. అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు కలిసి లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారు. బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారిద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని పేర్కొంది. న్యాయవాదుల సమక్షంలో పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదని వెల్లడించింది. 2022 సెప్టెంబర్ 18న పూర్తి స్టేట్​మెంట్ నమోదు చేశారన్న ఈడీ... రెండోసారి, మూడో దఫా ఇచ్చిన వాగ్మూలంలోను వివరాలను ఖరారు చేశారని వివరించింది. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్​మెంట్​లలో అవే విషయాలను ఎలా కన్ఫార్మ్ చేస్తారని ప్రశ్నించింది. మార్చి తర్వాతే స్టేట్​మెంట్ మార్చుకున్నారు... ఎందుకు మార్చుకున్నారో తెలుసని ఈడీ పేర్కొంది. బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు అరుణ్ రామచంద్ర పిళ్లై తన స్టేట్​మెంట్ మార్చుకున్నారని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.