ETV Bharat / state

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరందుకున్న ప్రచారాలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్న నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 7:56 PM IST

Telangana Election Campaign
Telangana Political Parties Speed up Election Campaign

Telangana Political Parties Speed up Election Campaign : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ నేతలు ప్రచారాల జోరును పెంచారు. ఇంటింటికి తిరుగుతూ... అధికారమే లక్ష్యంగా ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్నారు. ప్రచార రథాలతో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న నాయకులు.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సేవలు చేస్తారో వివరిస్తున్నారు. వినూత్న ప్రచారాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Telangana Political Parties Speed up Election Campaign ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరందుకున్న ప్రచారాలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్న నేతలు

Telangana Political Parties Speed up Election Campaign : నామినేషన్ల దాఖలు పూర్తికావటంతో అభ్యర్థులు, పార్టీలు ప్రచారంలో (Telangana Elections 2023) జోరును పెంచాయి. రాష్ట్రంలో మరోమారు అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్... ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన (BRS Election Campaign) పువ్వాడ.. జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు

BRS Candidates Door To Door Election Campaign : మరోవైపు దుబ్బాక నియోజకవర్గం రాయపోల్‌ మండలంలో అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన కుమారుడు పృథ్వి ఇంటింట ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం (TS Election Campaign) నిర్వహించగా... మిర్వాలగూడలో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించగా.. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో బాజిరెడ్డి గోవర్దన్‌ గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పలు గ్రామాల్లో చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

అధికార బీఆర్ఎస్​కు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్న విపక్షాలు రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు

"ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను నామినేషన్​ వేశాను. ప్రతి ఇంటికింటికి, వాడ వాడకు తిరుగుతూ ఓట్లు అడుగుతావున్నాం. వెళ్లిన ప్రతి ఇంటికి వారికి జరిగిన సంక్షేమం గురించి చెబుతున్నారు. కల్యాణలక్ష్మి వచ్చిందని, బీసీ బంధు, కేసీఆర్​ కిట్​ వచ్చిందనో చెబుతున్నారు. మీరే రావాలి కారే రావాలి అంటున్నారు." - పువ్వాడ అజయ్, మంత్రి

Congress Election Campaign of Six Guarantees : అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా ప్రతిపక్షాలు సైతం ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వ లోటుపాట్లను ప్రజలకు వివరిస్తున్న అభ్యర్థులు.. క్షేత్రస్థాయిలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలే (Congress Six Guarantees) ప్రచారాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఓ వైపు ప్రచారాలు, మరోవైపు ఆత్మీయ సమ్మేళనాలతో ఓట్ల వేట సాగిస్తున్నారు. ఖమ్మంలోని వరంగల్ క్రాస్​రోడ్​లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన తుమ్మలకు వ్యాపారులు ఘనస్వాగతం పలికారు.

నియోజకవర్గాల్లో ప్రచార హోరు గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

BJP Candidates Election Campaign : హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. బాన్సువాడలో సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ... ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

'మాది హైదరాబాద్​ - ఉర్దూ మాట్లాడ్డం మాకు కామన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.