ETV Bharat / state

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ - రెండు సీట్లు కాంగ్రెస్​కే!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 7:50 PM IST

Updated : Jan 11, 2024, 6:49 AM IST

Telangana MLC Election Notification 2024
Telangana MLA Quota MLC Notification

Telangana MLA Quota MLC Notification : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రెండు స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్​ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఎలక్షన్​లో పార్టీ బలాబలాలను చూపించాల్సి ఉంటుంది.

Telangana MLA Quota MLC Notification : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండింటికి విడివిడిగా ఉపఎన్నికలు(Telangana MLC Elections 2024) నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా ఈసీ విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫలితంగా మండలి ఉపఎన్నికల్లో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Telangana MLC Election Notification 2024 : గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు, అదే రోజు రాష్ట్ర అధికారిక గెజిట్‌లో కూడా విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 18వ తేదీ సాయంత్రం ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 29వ తేదీన ఈసీ ఎన్నికలు(EC Release MLC Election Notification) నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్‌ జరనుంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోలాహలం - అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ :

క్రమ సంఖ్య అంశం తేదీ(జనవరి నెలలో)
1 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 11
2 నామినేషన్ల ప్రక్రియ మొదలు 11
3 నామినేషన్ల ప్రక్రియ ముగింపు 18
4 నామినేషన్ల పరిశీలన 19
5 ఉపసంహరణకు గడువు 22
6 ఎన్నికలు నిర్వహణ 29
7 ఎన్నికల ఫలితాలు 29

Telangana MLC Election Notification Schedule 2024 : రెండు స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు జరగుతాయి. అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. రెండు నోటిఫికేషన్లకు అనుగుణంగా విడివిడిగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. శాసనసభ్యుల బలాబలాల మేరకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరిగితే ఆ రెండు స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ(Telangana Congress Won in MLC) దక్కించుకునేట్లు అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు

Last Updated :Jan 11, 2024, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.