ETV Bharat / state

రొమ్ము క్యాన్సర్​పై మహిళలు జాగ్రత్తగా ఉండాలి: గవర్నర్ తమిళిసై

author img

By

Published : Oct 31, 2020, 10:16 PM IST

రొమ్ము క్యాన్సర్​ అవగాహన మాసంలో చివరి రోజున రాజ్​భవన్​ను పింక్​ కలర్​ విద్యుత్​ దీపాలతో అలంకరించారు. రొమ్ము క్యాన్సర్​ పట్ల అవగాహనకు ఉషాలక్ష్మి బ్రెస్ట్​ క్యాన్సర్​ ఫౌండేషన్​ చేస్తున్న కృషిని గవర్నర్ తమిళి సై​ అభినందించారు.

telangana governor tamilisai sounder rajan on breast cancer month
రొమ్ము క్యాన్సర్​పై మహిళలు జాగ్రత్తగా ఉండాలి: గవర్నర్ తమిళిసై

కరోనా సమయంలో రొమ్ము క్యాన్సర్​పై మహిళలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు. రొమ్ము క్యాన్సర్​ అవగాహన మాసంలో చివరి రోజు ఉషాలక్ష్మి బ్రెస్ట్​ క్యాన్సర్​ ఫౌండేషన్​ సోమాజిగూడలోని రాజ్​భవన్​ను​ పింక్​ కలర్​ విద్యుత్​ దీపాలతో అందంగా అలంకరించారు.

రొమ్ము క్యాన్సర్​ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్​ క్యాన్సర్​ ఫౌండేషన్​ చేస్తున్న కృషిని గవర్నర్​ అభినందించారు. రొమ్ము క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తిస్తే జయించవచ్చని.. మహిళల్లో కొత్త మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని గవర్నర్​ కోరారు. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండిః రాజభవన్​లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.