ETV Bharat / state

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్లే: రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Jan 4, 2023, 2:41 PM IST

Updated : Jan 5, 2023, 6:13 AM IST

MLAs poaching case
MLAs poaching case

14:38 January 04

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్లే: రాష్ట్ర ప్రభుత్వం

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే: రాష్ట్ర ప్రభుత్వం

MLAs Poaching Case Updates: బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును.. సీబీఐకి అప్పగించాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప.. దర్యాప్తునకు సంబంధంలేదని తెలిపింది. ఆ విషయంలో.. సింగిల్ జడ్జి పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం పరిధిలోని సీబీఐక కేసును అప్పగించడమంటే.. కేసు అవసరం లేదనట్లేనని అప్పీలులో ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు రద్దు చేస్తూ.. సీబీఐకి బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వంతో పాటు డీజీపీ, సిట్, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ పోలీసులు కలిసి అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి పలు అంశాలు, సుప్రీంకోర్టు తీర్పుల్ని పరిగణనలోకి తీసుకోలేదని సర్కారు పేర్కొంది. సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని తెలిపింది.

దర్యాప్తును కొట్టివేయాలని పిటిషనర్లే కోరలేదు: సిట్ రద్దు చేయాలని.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కొట్టివేయాలని పిటిషనర్లే కోరలేదని ప్రభుత్వం పేర్కొంది. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని ఓ రాజకీయ పార్టీ నేతగా ముఖ్యమంత్రి మాట్లాడారని.. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంది. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిందితుల కుట్రను దేశ ప్రజలకు తెలిపి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగానే సీఎం మీడియా సమావేశాన్ని చూడాలని అప్పీలులో ప్రభుత్వం వివరించింది.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదు: ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఇతర అంశాల ఆధారంగానే ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపింది. సీఎం వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప.. దర్యాప్తునకు సంబంధంలేదని పేర్కొంది. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది.. పిటిషన్‌కు సంబంధం లేని అంశమని వివరించింది. స్వయంగా సీఎం వీడియోలను బహిరంగపరిచినందున సిట్ వేసినప్పటికీ.. పెద్దగా మార్పు ఉండదనడం ఊహాజనితమని పేర్కొంది.

పిటిషన్‌లో సీఎం ప్రతివాదిగా లేరు: సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం తప్పని.. పిటిషన్‌లో ముఖ్యమంత్రి ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదని వివరించింది. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం చట్టపరంగా తగదని తెలిపింది. నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సిట్‌పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో వివరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

నిందితులకు నష్టమనడం పొరపాటు: యూట్యూబ్‌లోని వీడియోలను పరిగణలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని పేర్కొంది. యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు న్యాయపరంగా నష్టమెలాగో వివరించలేదని పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చబోయారన్న ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమి కాదని ప్రభుత్వం పేర్కొంది. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటుగా అప్పీలులో సర్కారు పేర్కొంది.

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర చేసిందనేది.. ఎఫ్​ఐఆర్​లో ప్రధాన సారాంశమనితెలిపింది. అలాంటప్పుడు కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే... కేసు అవసరం లేదనట్లేనని అప్పీలులో ప్రభుత్వం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి తీర్పు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుందని.. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జిషీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఇవీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు... సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థన

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ.. ఆదేశించిన హైకోర్టు

కలిసికట్టుగా కష్టపడితే కాంగ్రెస్​కు అధికారం ఖాయం: రేవంత్‌ రెడ్డి

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో..!

Last Updated :Jan 5, 2023, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.