ETV Bharat / state

Telangana Assembly Passes Rejected Bills : బిల్లుల పునఃఆమోదం.. గవర్నర్​ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రుల ఆక్షేపణ

author img

By

Published : Aug 5, 2023, 7:55 AM IST

Updated : Aug 5, 2023, 12:37 PM IST

Telangana Assembly Passes Rejected Bills : గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులను శాసనసభ తిరిగి యథాతథంగా ఆమోదించింది. బిల్లులపై అభ్యంతరాలు.. రాజకీయం తప్ప మరొకటి కాదన్న మంత్రులు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని పలువురు సభ్యులు కోరారు.

Assembly
Bills again Approved

Telangana Assembly Passes Rejected Bills : బిల్లుల పునఃఆమోదం.. గవర్నర్​ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రుల ఆక్షేపణ

Telangana Assembly Passes Rejected Bills : గతంలో శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభ్యంతరాలు వ్యక్తం చేసి వెనక్కు పంపారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నాలుగు బిల్లులను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టి మళ్లీ చర్చించారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచాలని పురపాలక నిబంధనల చట్టసవరణ తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్​.. మైనార్టీలకు అదనంగా ఎలాంటి లబ్ధి చేసిందేమిలేదని తెలిపారు.

Telangana Assembly Sessions 2023 : ప్రభుత్వ వైద్య కళాశాలలు పెరిగిన నేపథ్యంలో వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టులకు ఇబ్బందులు లేకుండా డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామన్న మంత్రి హరీశ్ రావు.. మళ్లీ ఎవరినో తీసుకొచ్చి నియామకం చేస్తారన్న అపోహ తగదని చెప్పారు. నిపుణుల సిఫారసులకు అనుగుణంగానే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేసి కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను చేర్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

"పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచాలని పురపాలక నిబంధనల చట్టసవరణ తీసుకొచ్చాము. ఈ బిల్లులో మైనార్టీలకు అదనంగా ఎలాంటి లబ్ధి చేసిందేమిలేదు. శాసనసభ ఆమోదించిన బిల్లులను.. గవర్నర్ అభ్యంతరాల పేరుతో రాజకీయం చేస్తున్నారు." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి

Etela Rajender Speech in Assembly 2023 : 'ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోందే కానీ.. అమలు చేయట్లేదు'

Rejected Bills Passed in Telangana Assembly : భూమి, బిల్డింగ్ ప్లాన్స్ సరిగ్గా లేవని గవర్నర్ అభ్యంతరం తెలిపారన్న మంత్రి.. చట్టంలో ఆ అంశాలు లేవని వివరించారు. అనుమతులు రాకముందే విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి ఏంటని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కోర్సులను పెంచితే బాగుంటుందన్న కాంగ్రెస్ శాససభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క.. ఆమోదం లేకముందే ప్రవేశాలు చేస్తోంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా ఇతరులు కోరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి సబితా.. ముందే ప్రవేశాలు చేపట్టిన రెండు కళాశాలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో రెండేళ్ల పాటు మేనేజ్​మెంట్ కోటాను రద్దు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా సర్దుబాటు చేసినట్లు చెప్పారు.

అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ కోసం భద్రాచలాన్ని మూడు గ్రామపంచాయితీలుగా విభజించి పంచాయతీరాజ్ చట్టసవరణ చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మూడు పంచాయతీలుగా చేయడం బాధాకరమని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య అన్నారు.భద్రాచలాన్ని మున్సిపాలిటీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్న మంత్రి ఎర్రబెల్లి.. కేంద్రం చట్టం కారణంగా సాధ్యపడటం లేదని తెలిపారు. ఒక్కటి అయితే ఇబ్బంది ఉంటుందని మూడు పంచాయతీలుగా విభజించామని.. గవర్నర్‌కు కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

నాలుగు బిల్లులకు శాసనసభ మరోమారు ఆమోదముద్ర వేసింది. సభ్యులకు గవర్నర్ పంపిన సందేశాలకు సభ తీసుకున్న నిర్ణయం వర్తిస్తుందని, నాలుగు బిల్లులను పునఃపరిశీలించి ఆమోదించినట్లు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Bhatti Vikramarka VS Harish Rao : దేశానికి వైద్యం అందించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది: హరీశ్ రావు

Telangana Assembly on Floods Damage : అసెంబ్లీని కుదిపేసిన వరద నష్టతీవ్రత.. సభలో పరిహారం ప్రకటించాలని విపక్షాల పట్టు

Last Updated : Aug 5, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.