ETV Bharat / state

Telangana Assembly Election 2023 : జమిలి ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్​పై ప్రభావం చూపుతాయా?

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 7:09 AM IST

Telangana Assembly Election 2023 : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కమిటీని నియమించిన వేళ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. అనే చర్చ మొదలైంది. అధికారులు మాత్రం షెడ్యూల్​ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జమిలి లేదా ముందస్తుపై నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే తప్ప మార్పులు ఉండబోవని అంచనా వేస్తున్నారు.

One Nation One Election
Telangana Assembly Election 2023

Telangana Assembly Election 2023 జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుందా

Telangana Assembly Election 2023 : జమిలి ఎన్నికల(Jamili Election) అంశం తెరపైకి వచ్చిన వేళ రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీకి ఎన్నికలు(Telangana Assembly Election) ఎప్పుడు జరుగుతాయన్న విషయమై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అధికారులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికల నిర్వహణ దిశగా సన్నాహకాలు వేగవంతం చేశారు. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) కూడా రాష్ట్రంలో పర్యటించనుంది. అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జమిలి లేదా ముందస్తుపై నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే తప్ప మార్పులు ఉండబోవని అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది రెండోసారి ఓటర్ల జాబితా(Voter List) ప్రత్యేక సవరణను చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తుండగా.. వచ్చే నెల నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇతర ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి.

Assembly Elections in Five States : ఈవీఎం(EVM) ఫస్ట్ లెవల్ చెకింగ్ ఇప్పటికే పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి మొదలు బీఎల్​ఓ(BLO)ల వరకు ఇప్పటికే దశల వారీగా శిక్షణ కూడా ఇచ్చారు. మొదటి సారి పోలీసు అధికారులకు కూడా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సాఫీగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, తాయిలాలు పంచకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వివిధ విభాగాలతో చర్చించారు.

కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాష్ట్ర రెండో శాసనసభ 2019 జనవరి 17న కొలువు తీరింది. దీంతో కొత్త సభ 2024 జనవరి 16లోగా ఏర్పాటు కావాల్సి ఉంది. ఆ లోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఇదే సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 17 లోగా మిజోరాం, జనవరి మూడో తేదీలోగా ఛత్తీస్‌గఢ్​, ఆరో తేదీలోగా మధ్యప్రదేశ్, 14వ తేదీ వరకు రాజస్థాన్ శాసనసభలు కొలువు తీరాల్సి ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

Jamili Elections Impact on Telangana Assembly Elections : ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ వెలువరించవచ్చని అంటున్నారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు అంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈసీ పర్యటన కోసం రాష్ట్ర అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా ఆలోచన చేస్తున్న వేళ.. శాసనసభ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

One Nation One Election : జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ చాలా అంశాలతో ముడి పడి ఉంటుందని.. న్యాయ, సాంకేతిక పరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని చెపుతున్నారు. ఒకవేళ కేంద్రం ముందస్తుకు వెళ్లాలనుకున్నప్పటికే ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం సన్నద్ధత ఇబ్బందికరం అవుతుందని అంటున్నారు.

Telangana Assembly Elections Schedule 2023 : అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

Jamili Election Committee Appointed by Central Govt : జమిలి లేదా ముందస్తుపై కేంద్రం నిర్ణయం తీసుకొంటే అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ నిర్ధిష్ట గడువు అయిన జనవరి 16వ తేదీలోగా కొలువు తీరాల్సిందే. ఆలస్యమైతే సభా గడువును పొడిగించాల్సి ఉంటుందని.. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఉభయ సభల్లోనూ రెండింట మూడొంతుల మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులువు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ దిశగా సన్నాహకాలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉన్న అడ్డంకులు అన్నింటిని అధిగమించి జమిలి లేదా ముందస్తు ఎన్నికలకు కేంద్రం వెళ్తే మాత్రం ఆ ప్రభావం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.

One Nation One Election Committee : కేంద్రం కీలక నిర్ణయం.. 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు'పై కమిటీ!.. రామ్​నాథ్​ నేతృత్వంలో..

One Nation One Election Committee : జమిలి ఎన్నికలపై కసరత్తు ముమ్మరం.. రామ్​నాథ్​ ఇంట్లో కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.