ETV Bharat / bharat

One Nation One Election : జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ.. ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 5:14 PM IST

Updated : Sep 3, 2023, 5:34 PM IST

One Nation One Election Committee : జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పని ప్రారంభించింది. ఈ మేరకు కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ జమిలి ఎన్నికలను రాష్ట్రాలపై దాడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఇక దీంతో ప్రజలకు ఒరిగేదేంటని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ప్రశ్నించారు.

One Nation One Election Committee
One Nation One Election Committee

One Nation One Election Committee : జమిలి ఎన్నికల నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది. ఈ మేరకు న్యాయ శాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశం నిర్వహించి.. కమిటీ ఛైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు.. కమిటీ పనితీరును వివరించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితేన్ చంద్ర, లెజిస్లేటివ్ సెక్రటరీ రీటా వశిష్ట తదితరులు ఆదివారం కోవింద్​ను కలిశారు.

'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు .. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది. రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.

జమిలి ఎన్నికలు అంటే.. రాష్ట్రాలపై దాడి : రాహుల్​ గాంధీ
పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై.. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఆలోచన దేశం, అందులోని రాష్ట్రాలపై దాడి చేయడమే అని మండిపడింది. ముఖ్యంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరు చూస్తుంటే సిఫార్సులు ఇప్పటికే నిర్ణయించినట్లు అనిపిస్తోందని హస్తం పార్టీ ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి నిరాకరించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్‌ చేశారు. అమిత్‌ షాకు అధీర్‌ రాసిన లేఖను కూడా ట్యాగ్‌ చేశారు. ఇండియా అంటే భారత్‌ అని, రాష్ట్రాల సమాహారమని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఒక దేశం-ఒక ఎన్నిక అంటే.. దేశం, అందులోని రాష్ట్రాలపై దాడిగా అభివర్ణిస్తూ.. రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

  • INDIA, that is Bharat, is a Union of States.

    The idea of ‘one nation, one election’ is an attack on the 🇮🇳 Union and all its States.

    — Rahul Gandhi (@RahulGandhi) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'జమిలి' వల్ల ప్రజలకు ఒరిగేదేంటి? : అరవింద్​ కేజ్రీవాల్
జమిలి ఎన్నికలు కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీనికి ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు. దీని వల్ల ప్రజలు ఒరిగేదేంటని నిలదీశారు. 'దేశానికి ఏది ముఖ్యం? వన్​ నేషన్-వల్​ ఎలక్షన్​ లేదా వన్​ నేషన్​-వన్ ఎడ్యుకేషన్ (పేద, ధనిక తేడాలేకుండా అందరికీ మంచి విద్య), వన్​ నేషన్​ వన్​ ట్రీట్​మెంట్​ (పేద, ధనిక అని తేడా లేకుండా సమానంగా చూడటం). ఈ జమిలి ఎన్నికల వల్ల సామాన్యుడికి ఏం లభిస్తుంది?' అని సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో పోస్ట్ చేశారు.

  • देश के लिए क्या ज़रूरी है?

    वन नेशन वन इलेक्शन

    या

    वन नेशन वन एजुकेशन (अमीर हो या गरीब, सबको एक जैसी अच्छी शिक्षा)

    वन नेशन वन इलाज (अमीर हो या गरीब, सबको एक जैसा अच्छा इलाज)

    आम आदमी को वन नेशन वन इलेक्शन से क्या मिलेगा?

    — Arvind Kejriwal (@ArvindKejriwal) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి స్పష్టత..
జమిలి ఎన్నికల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వాటిపై ఓ స్పష్టతనిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా లేదా ఆలస్యంగా నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదని అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ముందస్తు ఎన్నికలను వెళ్లే ఆలోచన ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. పదవీకాలం చివరి రోజు వరకు మోదీ దేశ ప్రజలకు సేవ చేయాలనుకుంటారని ఠాకూర్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ముందస్తుగా లేగా ఆలస్యంగా జరుగుతాయని వస్తున్న చర్చలు కొన్ని మీడియా సంస్థల ఊహాగానాలను అనురాగ్ ఠాకూర్ కొట్టిపారేశారు.

'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు

One Nation One Election : 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' చిక్కులివే!.. నిర్వహణ సాధ్యమేనా?

Last Updated :Sep 3, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.