ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Jul 23, 2020, 6:19 PM IST

Updated : Jul 23, 2020, 10:56 PM IST

తెలంగాణాలో కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి దశ ప్రారంభమైందని, వచ్చే నాలుగైదు వారాల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా చికిత్స కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేశారని వైద‌్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Tealanaga Health Director Srinivas warned on Corona diseases
'రాబోయే నాలుగైదు వారాలు చాలా ప్రమాదం... పరిస్థితులు క్లిష్టంగా మారొచ్చు'

రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. తెలంగాణాలో కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని, వచ్చే నాలుగైదు వారాల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో... నాలుగైదు వారాలపాటు పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గురువారం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోనే ఇప్పటి వరకు వెయ్యి మంది కరోనా బారిన పడ్డినట్లు వెల్లడించారు. ఒక ఆరోగ్యశాఖ అధికారి, ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారులు కూడా మరణించినట్లు తెలిపారు. ప్రజలు అనవరసరంగా భయాందోళకు గురికావొద్దని.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాలు 0.88 శాతం మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.

సామాజిక బాధ్యతగా అంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండబోతున్నాయని హెచ్చరించారు. హైదరాబాద్‌ నగరంలో పరిస్థితులు ఇంకా సంక్లిష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. నగరంలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో మాత్రం వైరస్ విస్తరిస్తోందని తెలిపారు. 16 వేల పడకలు ఇంకా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల విలువైన మందులను ప్రభుత్వం కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుందని పేర్కొన్నారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే చనిపోతున్నారని వెల్లడించారు.

ప్రస్తుతం రోజుకు 15 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 20 వేలకు పెంచనున్నట్టు డీఎంఈ, డీహెచ్‌ తెలిపారు. గత వారం రోజుల్లో కేసుల సంఖ్య జిల్లాల్లో పెరుగుతున్నందున వాటిపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు డీఎంఈ రమేష్‌రెడ్డి చెప్పారు. అవసరం లేని వారు కరోనా పరీక్షలకు దూరంగా ఉండటం ద్వారా ఆయా కేంద్రాల్లో రద్దీని తగ్గించవచ్చని, నిజంగా పరీక్షలు అవసరం అయిన వారికి మేలు చేసిన వారవుతారని సూచించారు. కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు మరో రెండు లక్షలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్‌ శ్రీనివాస్‌ చెప్పారు.

'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

Last Updated : Jul 23, 2020, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.