ETV Bharat / state

'ప్రభుత్వం వెంటనే మహిళ కమిషన్​ను ఏర్పాటు చేయాలి'

author img

By

Published : Sep 18, 2020, 4:10 PM IST

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్ద తెదేపా మహిళా విభాగం.. ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం వెంటనే మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

tdp protest
'ప్రభుత్వం వెంటనే మహిళ కమిషన్​ను ఏర్పాటు చేయాలి'

ప్రభుత్వం వెంటనే మహిళ కమిషన్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ... తెలంగాణ తెదేపా మహిళా విభాగం ట్యాంక్​ బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహం ముందు ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆచార్య జ్యోత్స్న విమర్శించారు.

మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ పదవీ ముగిసి రెండేళ్లు గడుస్తున్నా... నూతన ఛైర్​పర్సన్ నియమించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళ కమిషన్​ను నియమించకపోతే.... అన్ని రాజకీయ పార్టీలను, మహిళ సంఘాలను ఐక్యం చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.