ETV Bharat / state

మంత్రి హరీశ్‌రావు ఇంటి ముట్టడి.. తమను రీలొకేట్ చేయాలని డిమాండ్

author img

By

Published : Jun 9, 2022, 12:11 PM IST

Updated : Jun 9, 2022, 12:53 PM IST

protests at minister harish rao house
మంత్రి హరీశ్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

12:07 June 09

కోకాపేటలో మంత్రి హరీశ్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

Protests at Harish Rao's House: హైదరాబాద్ కోకాపేటలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటిని వైద్య విద్యార్థులు ముట్టడించారు. ఎంఎన్​ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్​లో తమకు సీట్లు వచ్చినా... మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో కళాశాల అనుమతి రద్దు చేయడంతో రోడ్డున పడ్డామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రిని కలిసిన 79 మంది విద్యార్థులు... తమను రీ లొకేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఎంసీ ఆదేశాలు జారీచేసినా కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

ఈ ఏడాది ఎక్కడ వృథా అవుతుందోనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని హరీశ్ రావు వద్ద కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్​రావు.. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: TSRTC Charges: మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుంచే అమలు

'రూ.10 కోసం అమ్మ పడిన కష్టం చూశా.. అందుకే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నా...'

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరో 7,240 మందికి వైరస్​

Last Updated :Jun 9, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.