ETV Bharat / entertainment

'రూ.10 కోసం అమ్మ పడిన కష్టం చూశా.. అందుకే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నా...'

author img

By

Published : Jun 9, 2022, 8:05 AM IST

'జబర్దస్త్​'లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువకాలంలోనే బుల్లితెరపై పాపులర్ అయిపోయింది ఫైమా. తన కామెడీ టైమింగ్​తో ప్రతీ స్కిట్​నూ పండిస్తూ.. నవ్వులు పూయిస్తోంది. ఇలా అందరినీ నవ్వించే ఫైమా.. బుల్లితెరకు రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తాజాగా ఈటీవీ భారత్​ చేసిన ఇంటర్వ్యూలో​ పాల్గొన్న ఈమె తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. తన లక్ష్యం ఏంటో వివరించింది. అదేంటో తెలుసుకుందాం...

faima
faima

ఫైమా

ఫైమా.. పటాస్​ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎక్స్​ట్రా జబర్దస్త్​తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. బుల్లెట్​ భాస్కర్​, ఇమ్మాన్యుయెల్​ చేసే స్కిట్​లలో పాల్గొని తనదైన శైలి కామెడీ టైమింగ్​తో వీక్షకులను కితకితలు పెట్టిస్తోంది. చాలా తక్కువ కాలంలో జబర్దస్త్​లోని పాపులర్​ ఆర్టిస్ట్​లలో ఒకరిగా నిలిచింది. అయితే ఈ ప్రయాణం వెనుక ఆమె అసలు లక్ష్యం వేరే ఉందట. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జబర్దస్త్​లో తన ప్రయాణం మొదలైన విషయాలపై ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

బీడీ అమ్మిన డబ్బులతోనే: తన తల్లి.. తమకు ఏం కావాలన్నా బీడీలు చుట్టి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే కొనేదని చెప్పుకొచ్చింది ఫైమా. తాము మంచి పేరు సంపాదించాలని ఆమె ఆకాంక్షించేదని చెప్పింది. చిన్న వయసులోనే అక్కాచెళ్లెళ్లకు పెళ్లి అయిపోయిందని పేర్కొంది.

"మేం నలుగురు అక్కాచెళ్లెలం.. చిన్నప్పటి నుంచి మాకు ఏదైనా కావాలంటే అమ్మ బీడీలు చుట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మాకు కొనిచ్చేది. మాలో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా చేసేసింది. మంచిపేరు తెచ్చుకోండి అని చెప్తూ ఉండేది. మంచి పేరు అంటే ఎలా తీసుకొస్తారో నాకు తెలిసేది కాదు. కానీ మల్లెమాల ద్వారా నేను మంచి పేరు తీసుకొచ్చాను.. అలా అమ్మ కల నెరవేరింది."

-ఫైమా, ఎక్స్​ట్రా జబర్దస్త్​ నటి

"నాకేం డ్రీమ్స్​ లేవు. చదువులో కూడా వెనకపడేదాన్ని. మిషన్​లో బట్టలు కుట్టడం నేర్చుకుని జీవనం సాగించాలని అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక ఉండేది.. అమ్మకు ఇల్లు కట్టాలని. మా నలుగురినీ సాకుతూ ఇళ్లు మారుతూ ఉండేది. ఒక ఇంటివాళ్లు వెళ్లిపోమంటే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. వేరే ఇల్లు దొరికినా సరైన సదుపాయాలు లేక.. సర్దుకుపోయేవాళ్లం. ఆ కష్టాలను చూశాను కాబట్టీ మాకంటూ ఓ ఇల్లు ఉంటే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు నా గోల్​ కూడా అదే. అందుకే ఎలాగైనా మంచి ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను." అని చెప్పుకొచ్చింది ఫైమా.

ఇదీ చూడండి: అది జరిగితే.. నా పెళ్లి గురించి చెబుతా: కార్తిక్ ఆర్యన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.