ETV Bharat / state

పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్​ అప్​డేట్​ ప్రక్రియ

author img

By

Published : Dec 31, 2019, 5:40 AM IST

Updated : Dec 31, 2019, 7:52 AM IST

రాష్ట్రంలో ఐదు నుంచి పదిహేనేళ్ల వయసున్న విద్యార్థుల ఆధార్​ సమాచారాన్ని అప్​డేట్​ చేసేందుకు సర్కార్​ సన్నద్ధమైంది. 1,344 కిట్స్‌ను పాఠశాలలకు పంపి విద్యార్థుల ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సమాచారం సేకరించిన తర్వాత... ఇదే కిట్లతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తామని యూఐడీఏఐ అధికారులు వెల్లడించారు.

students aadhar card will be updated in schools by telangana government
పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్​ అప్​డేట్​ ప్రక్రియ

పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్​ అప్​డేట్​ ప్రక్రియ

రాష్ట్రంలో విద్యార్థులకు చెందిన ఆధార్‌ అప్‌డేట్‌ కార్యక్రమాన్ని పాఠశాలల ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులకు చెందిన ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసేందుకు 1,344 కిట్లు సిద్ధం చేసినట్లు యూఐడీఏఐ అధికారులు తెలిపారు.

ఆధార్​ కిట్ల పంపిణీ

నెలల నిండిన చిన్నారులకు కూడా ఆధార్‌ కార్డులను జారీ చేస్తుండగా ఐదేళ్లు నిండిన తరువాత ఒకసారి, 15 ఏళ్ల తర్వాత మరోసారి వేలిముద్రలను అప్‌డేట్‌ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. విద్యాశాఖ ద్వారా విద్యార్థుల ఆధార్‌ అప్‌డేట్ చేసేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన 1,344 కిట్లను పాఠశాలల వారీగా పంపిణీ చేయనున్నారు.

ఉచిత సేవలు

ఈ కిట్ల ద్వారా విద్యార్థుల ఆధార్‌ అప్‌డేట్‌ చేసే కార్యక్రమంతోపాటు ఇప్పటి వరకు ఆధార్‌ తీసుకోని విద్యార్థులకు కొత్తగా ఆధార్‌ కార్డులు జారీ చేస్తారు. తొలిసారిగా ఆధార్‌ నమోదు చేసుకునే విద్యార్థుల దరఖాస్తులపై తల్లిదండ్రుల సంతకాలు అనివార్యమని అధికారులు తెలిపారు. ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. తొలిసారి వివరాలు నమోదు చేసుకునే విద్యార్థులకు ఉచితంగానే సేవలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.

నిధుల కోసం నివేదిక

విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని కిట్స్‌ అవసరమన్నది అధికారులు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. అందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రానికి నివేదిక పంపనున్నారు. కిట్స్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆధార్​ నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉడాయ్​ అధికారులు తెలిపారు.

TG_Hyd_11_31_ADHAAR_STUDENTS_KITS_READY_PKG_3038066 Reporter: Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో ఆధార్‌ నమోదుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే సిద్దమైన 1344 కిట్స్‌ పాఠశాలలకు పంపి విద్యార్ధుల ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తయిన తరువాత ఇదే కిట్లను ప్రయివేటు పాఠశాలలకు కూడా పంపించి ఆప్‌డేట్‌ చేయించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని యుఐడిఎఐ అధికారులు వెల్లడించారు. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధులకు చెందిన ఆధార్‌ అప్‌డేట్‌ కార్యక్రమాన్ని పాఠశాలల ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సున్న విద్యార్ధులకు చెందిన ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసేందుకు 1344 కిట్లు సిద్దం చేసినట్లు యుఐడిఎఐ అధికారులు తెలిపారు. నెలల నిండిన చిన్నారులకు కూడా ఆధార్‌ కార్డులను జారీ చేస్తుండగా అయిదేళ్లు నిండిన తరువాత ఒకసారి, 15 సంవత్సరాల తరువాత మరొకసారి వేలిముద్రలను అప్‌డేట్‌ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. విద్యాశాఖ ద్వారా విద్యార్ధుల ఆధార్‌ అప్‌డేట్ చేసేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన 1344 కిట్లను పాఠశాలల వారీగా పంపనున్నారు. ఈ కిట్ల ద్వారా విద్యార్ధుల ఆధార్‌ అప్‌డేట్‌ చేసే కార్యక్రమంతోపాటు ఇప్పటి వరకు ఆధార్‌ తీసుకోని విద్యార్ధులకు కొత్తగా ఆధార్‌ కార్డులను జారీ చేస్తారు. తొలిసారిగా ఆధార్‌ నమోదు చేసుకునే విద్యార్ధుల ధరఖాస్తులపై తల్లిదండ్రుల సంతకాలు అనివార్యమని అధికారులు తెలిపారు. ఆధార్‌ కార్డు ఉండి అందులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా...ఇక్కడ వెసులుబాటు కల్పించారు. పాఠశాలల్లో చేసే ప్రతి సేవా కూడా పూర్తిగా ఉచితమని...అదే సేవా కేంద్రాల్లో పొందేందుకు కూడా అవకాశం కల్పించారు. తొలిసారి వివరాలు నమోదు చేసుకునే విద్యార్ధులకు ఉచితంగానే సేవలు అందిస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్ధుల వేలిముద్రలు, వివరాలను అప్‌డేట్‌ చేసే ప్రక్రియ త్వరలో కార్యరూపం దాల్చుతుందని అధికారులు తెలిపారు. విద్యార్దుల సంఖ్య ఆధారంగా ఎన్ని కిట్స్‌ అవసరమన్నది అధికారులు ప్రతిపాదనలు రూపొందించి అందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంది. కిట్స్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టనున్నారు.
Last Updated : Dec 31, 2019, 7:52 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.