ETV Bharat / state

Teachers Protest in Hyderabad : ఒకే జిల్లాకు బదిలీ చేయలంటూ.. స్పౌజ్​ టీచర్ల ఆందోళన

author img

By

Published : Jul 10, 2023, 7:19 PM IST

Teachers Protest in Hyderabad : వేరు వేరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న స్పౌజ్​ టీచర్లను.. ప్రభుత్వం ఒకే జిల్లాకు బదిలీ చేయాలని కోరుతూ పదమూడు జిల్లాల ఉపాధ్యాయ దంపతులు హైదరాబాద్​ ధర్నాచౌక్​లో ఆందోళన చేపట్టారు. పలువురు మహిళా ఉపాధ్యాయినీలు బోనాలతో ర్యాలీ తీసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Spouse Teachers
Spouse Teachers

Spouse Teachers Protest at Dharna chowk : హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు ఆందోళన నిర్వహించారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆవేదన సభ నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులు బోనాలతో ర్యాలీ తీసి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, టీపీటీఎఫ్​, ఆపస్​, ఎస్​టీయూ తదితర సంఘాల ప్రతినిధులు హాజరై స్పౌజ్ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

317 జీవో ఆశాస్త్రీయమైందని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీచర్ల సమస్యలపై.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. గత 18 నెలలుగా మహిళా ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహించడం దుర్భరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి టీచర్ల సమస్యపై దృష్టిసారించి తక్షణమే పరిష్కరించాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాల ఫలితంగా భార్యాభర్తలు వేరువేరు చోట్ల పనిచేయాల్సిన పరిస్థతి ఏర్పడిందని.. పరోక్షంగా ప్రభుత్వమే దంపతులను విడదీస్తోందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి దయతలచి దంపతులు ఇద్దరినీ ఒకే జిల్లాలో ఉద్యోగాలు చేసుకునే విధంగా బదిలీలు చేయాలని వేడుకున్నారు. దంపతులు వేరువేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విన్నవించారు. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తరలిరావడంతో ఇందిరాపార్క్ వద్ద హడావుడి నెలకొంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయసంఘాలను కట్టడి చేసి ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు.

317 జీవో ఆశాస్త్రీయమైంది. రాష్ట్రంలోని టీచర్ల సమస్యలపై.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పౌజ్​ టీచర్ల సమస్యలపై దృష్టిసారించి.. బదిలీలు చేపట్టాలి. -ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ

"రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాల ఫలితంగా భార్యాభర్తలు వేరువేరు చోట్ల పనిచేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. పందొమ్మిది జిల్లాలో మాత్రమే స్పౌజ్​ బదిలీలు చేశారు. మిగతా పదమూడు జిల్లాలోనూ బదిలీలు చేపట్టాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం స్పౌజ్​బదిలీలు ప్రారంభించాలి". - త్రివేణి, మహిళా ఉపాధాయురాలు

ఒకే జిల్లాకు బదిలీ చేయలంటూ.. స్పౌజ్​టీచర్ల ఆందోళన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.