ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రోజుకో కొత్త కోణం..!

author img

By

Published : Mar 22, 2023, 7:53 AM IST

TSPSC Paper Leakage Issue: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. నాలుగో రోజు కస్టడీలో భాగంగా నిందితుల నుంచి పోలీసులు మరిన్ని కీలక ఆధారాలను సేకరించారు. వారి కాల్‌డేటా, వాట్సప్‌ గ్రూపులు, ఛాటింగ్ ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారనే అంశంపై తీగలాగుతున్న సిట్‌.. వీరిలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాసి, ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా రూపొందిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మినీ సిట్‌ కార్యాలయంలో విచారించారు.

TSPSC Paper Leakage Update
TSPSC Paper Leakage Update

TSPSC పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రోజుకో కొత్తకోణం

TSPSC Paper Leakage Issue: రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నాలుగో రోజు పోలీసు కస్టడీలో భాగంగా 9 మంది నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. పరీక్షా పత్రాలు ఎవరికి విక్రయించారనే అంశంపై దృష్టి సారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. టీఎస్​పీఎస్సీ వివిధ విభాగాల్లో పని చేస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. వీరిలో కొందరు 100కు పైగా మార్కులు సాధించినట్లు నిర్ధారించారు. వీరిని విచారిస్తే కీలక సమాచారం బయటకు వస్తుందనే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు.

TSPSC Paper Leak Case Update News: మరోవైపు.. నిన్న ఉదయం రేణుక రాఠోడ్, ఆమె భర్త డాక్యానాయక్‌ను బండ్లగూడలోని జాగీర్‌ సన్‌సిటీలో ఉంటున్న వారి బంధువుల ఇళ్లకు తీసుకెళ్లి సోదాలు జరిపారు. మరో బృందం బడంగ్‌పేట్, మణికొండ ప్రాంతాల్లోని ప్రవీణ్‌ కుమార్, రాజశేఖర్‌రెడ్డి నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రశ్నాపత్రాలు, పెన్‌డ్రైవ్ లభించినట్టు తెలుస్తోంది. కమిషన్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్​డిస్క్‌లను సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

TSPSC Paper Leakage Update: గతేడాది కంప్యూటర్ల మరమ్మతు సమయంలో నిందితులు వాడిన సాఫ్ట్‌వేర్‌, మార్చిన ఐడీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పని చేసిన రాజశేఖర్‌రెడ్డి మొబైల్‌లోని వాట్సప్ గ్రూపులను పరిశీలిస్తున్న అధికారులు.. వీరిలో పోటీ పరీక్షలకు సిద్ధమైన వారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల ద్వారా వారి చిరునామాలను సేకరిస్తున్నారు. తాను పట్టుబడినా ఎక్కడా సాక్ష్యాలు దొరక్కకుండా ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు విశ్వసనీయ సమాచారం.

టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం: పెన్‌డ్రైవ్‌లకు పాస్‌వర్డ్‌లు ఉంచిన నిందితులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నపుడు పాస్‌వర్డ్‌ మరచిపోయామంటూ ఏమార్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మిని సిట్ పోలీసులు విచారించారు. ఆమెను సిట్ కార్యాలయానికి రావలసిందిగా ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి కమిషన్‌లోని ఆమె కంప్యూటర్‌ను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో అంగీకరించారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను శంకరలక్ష్మి డైరీ నుంచి కొట్టేసినట్లు తెలిపారు.

శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన సిట్: దీనిపై గతంలోోనే ఆమె స్పందించారు. డైరీలో తాను ఎటువంటి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. ఆమెను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించటం చర్చనీయాంశంగా మారింది. విచారణకు శంకరలక్ష్మితో పాటు అదే సెక్షన్లో పని చేసే మరో మహిళా ఉద్యోగి సైతం హాజరయ్యారు. మరో వైపు అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాసిన గోపాల్, నీలేశ్​.. నీలేశ్​ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చినట్లు అధికారులు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్లు తెలుస్తోంది.

మార్చి 5న నీలేశ్, గోపాల్‌లు అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాశారు. వీరు పేపర్ ఇచ్చినందుకు రూ.14 లక్షలు సమకూర్చారు. ఇదిలా ఉండగా.. సిట్ బృందంలో "లా అండ్ ఆర్డర్", సైబర్ క్రైం, ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పాలుపంచుకుంటున్నారు. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో టీఎస్​పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్‌ క్రైం పోలీసులు విశ్లేషిస్తున్నారు. హిమాయత్​నగర్ సిట్ కార్యాలయంలో నిందితులను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.